చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం జగన్ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు అనేక అధికారాలు కట్టబెట్టింది. ఈ సిట్ విచారణలో భాగంగా.. ఎవరినైనా పిలిపించుకోవచ్చు.. ఎవరి వద్దకైనా విచారణకు వెళ్లొచ్చు.. ఎలాంటి డాక్యుమెంట్లైనా చెక్ చేయవచ్చు.. కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం, రికార్డు చేయడం వంటి అన్ని అధికారాలనూ కట్టబెట్టింది ప్రభుత్వం.

 

ఈ సిట్ కు డీఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఇంతకీ ఎవరీ ఐపీఎస్ రఘురామిరెడ్డి. జగన్ ఏరి కోరి ఈయనకే ఈ కీలక సిట్ బాధ్యతల ఎందుకు అప్పగించారు..అసలు ఈయన చరిత్ర ఏంటి.. ఈయన ప్రత్యేకతలేంటి ఓ సారి చూద్దాం.. కొల్లి రఘురామిరెడ్డి.. 2006 బ్యాచ్ ఐపీఎస్… ఈ రఘురామిరెడ్డిపై వైసీపీ అనుకూలుడన్న ముద్ర ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఈయన వైసీపీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబే ఆరోపించారు కూడా.

 

2014లో కేంద్రంలోకి డిప్యూటేషన్ పై వెళ్లి 2019 సెప్టెంబరులో మళ్లీ ఏపీకి తిరిగివచ్చారు. అప్పటి నుంచి ఇంటలిజెన్స్‌లో పని చేస్తున్నారు. అయితే జగన్ ప్రత్యేకించి ఈ కేసుల విచారణకు రఘురామిరెడ్డినే ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ రఘురామిరెడ్డి గతంలో అనేక వైట్ కాలర్ నేరాలను చాకచక్యంగా దర్యాప్తు చేశాడు. దోషుల ఆట కట్టించాడు. ఈ విషయంలో చాలా మంది పేరు సంపాదించుకున్నారు.

 

ఆమ్వే ఇండియా అనే ఓ నెట్ వర్క్ మార్కెటింగ్ సంస్థ అక్రమాలపై ఉక్కుపాదం మోపాడు. ఈ సంస్థ సీఈవో విలియన్ స్కాట్ పిక్నీని గుర్ గ్రామ్ వెళ్లి మరీ అరెస్టు చేశాడు. ఎన్‌మార్ట్ కేసు విషయంలో దాని అధిపతి బాసు గోపాల్ షెఖావత్ వంటి కోటీశ్వరుడినూ అరెస్టు చేశాడు. నక్షత్ర, అక్షయ గోల్డ్ వంటి కేసులు కూడా డీల్ చేశాడు. అందుకే జగన్ ఏరి కోరి ఇతన్ని ఎంచుకుని సిట్ బాధ్యతలు అప్పగించాడు. మరి ఈయన ఎంత సమర్థంగా పని చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: