పిల్లలకు చక్కగా చదువు చెబుతారనే నమ్మకంతోనే తల్లిదండ్రులు స్కూల్‌కు పంపిస్తారు.. ఇలాంటి నమ్మాకాన్ని నేటికాలంలో కొందరు టీచర్లు వమ్మూచేస్తున్నారు.. విద్యా వ్యవస్దను నాశనం చేస్తున్నారు. కొన్ని కొన్ని స్కూళ్లల్లో అయితే పిల్లలు కూడా రౌడిల్లా తయారు అవుతున్నారు.. ఇలా సమాజానికి మంచిని అందించవలసిన, బాధ్యతగల ఉపాధ్యాయులు, దేశానికి శక్తిలా మారవలసిన యువత చీడపురుగుల్లా తయారవుతున్నారు..

 

 

ఇకపోతే చదువు చెప్పమని ఓ చిన్నారిని పాఠశాలకు పంపిస్తే చిత్రహింసలకు గురిచేసి కోమాలోకి పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. ఔరంగాబాద్ సమీపంలో ఉంటున్న  ఓం చౌదరి అనే పిల్లవాడిని అతని తల్లి అలాండిలోని శ్రీ మౌళి గ్యాన్‌రాజ్ క్రిపా ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించింది.. అక్కడ టీచర్ చెప్పిన హరిపాట్‌ను ఈ చాలుడు చదవలేకపోయాడు. దాంతో టీచర్ కమ్ ఫౌండర్ అయిన పొవానె విద్యార్థిని పలు మార్లు కిందకు తోసేశాడట..

 

 

ఆ తర్వాతి రోజు పాఠశాలలోని విద్యార్ధులను అందరిని ఔరంగబాద్‌లోని కీర్తన్ సెషన్ లో పాల్గొనేందుకు తీసుకెళ్లాడు. అక్కడికి చిన్నారి రాలేనని చెప్పినా వినకుండా బలవంతంగా తీసుకెళ్లారు. అయితే ఆ సెషన్ లో ఈ చిన్నారి ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడంతో, అతని తల్లికి మీ అబ్బాయి ఆరోగ్యం బాలేదు.. ఔరంగబాద్ వచ్చి తీసుకెళ్లండి అని చెప్పారట.. పాపం రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం వల్ల. ఆ తల్లి తన కొడుకుని శ్రీ మౌళి గ్యాన్‌రాజ్ క్రిపా ప్రసాద్ కు పంపించగా, వారు ప్రేమంతో చెప్పవలసిన పాఠాలను, భయపెట్టి, చిత్రహింసలకు గురిచేసి ఇలా ఆ పిల్లవాన్ని హస్పిటల్ పాలు చేశారని వాపోయింది..

 

 

ఇకపోతే ఆ పిల్లవాన్ని తీసుకుని హాస్పిటల్ కు వెళ్లగా అప్పటికే  ఆ పిల్లవాడు స్పృహ కోల్పోయాడట. అతన్ని హస్పిటల్లో చేర్పించి ట్రీట్‌మెంట్ చేయిస్తు ఉండగా వారం రోజులకు గాని కోమాలో నుండి బయటకు రాలేదట.. ఇక అతను స్పృహలోకి వచ్చాక విచారిస్తే టీచర్ తన కాళ్లు.. చేతులు కట్టేసి పాఠాలు కంఠస్థం చేయాలంటూ భయపెట్టేవాడని, మానసికంగా హింసించేవాడని చెప్పాడు. ఆ తర్వాతి రోజు నాకు బాగాలేదని చెప్తున్నా.. పట్టించుకోకండా ఔరంగబాద్ తీసుకెళ్లారు. తినమని ఆహార పదార్థం ఇచ్చారు. అనారోగ్యంగా ఉందని చెప్పినా వినకుండా బలవంతంగా పట్టించారు. కాసేపటికే కళ్లు తిరిగిపడిపోయా అని ఆ విద్యార్థి తెలిపాడు..

 

 

ఇకపోతే చిన్నారులకు చదువు నేర్పే స్కూళ్లే చిత్రహింసలు పెడుతుంటే విద్యా బుద్ధులు కాదు కదా.. బతకడానికి కూడా వారు పనికి రాకుండా పోతున్నారు . ఆధ్మాత్మిక విద్యను బోధించే పాఠశాలలో భగవాన్ మహారాజ్ పొవనె అనే టీచర్ కొట్టిన దెబ్బలు బాలుడి ప్రాణాల మీదకు తెచ్చాయి. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. విషమమైన పరిస్థితిలో హాస్పిటల్ లో చేర్చగా ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా ఈ విషయంలో అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: