ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గత వారం కాస్త కష్టంగానే గడిచినా ఆ పార్టీకి కలిసి వచ్చే అంశాలు మాత్రం కొన్ని ఉనాయనే చెప్పవచ్చు. రాజకీయంగా బలపడాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ మీద అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీని ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం, ముఖ్యంగా ఈఎస్ఐ అవినీతి విషయంలో తెలుగుదేశం పార్టీ తొలుత కలవరానికి గురైంది. ఆ తర్వాత వెంటనే తేరుకుని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, చంద్రబాబు ఇద్దరూ కూడా దీనిపై కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

 

ఇక అమరావతి భూముల విషయంలో, గత ప్రభుత్వం మీదున్న అవినీతి ఆరోపణల మీద ప్రభుత్వం సిట్ వేయడం ఈ వారం ఒక షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మీద సిట్ వేయలేదు. ఇప్పటి వరకు సిట్ కి ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏ ప్రభుత్వం కేటాయించలేదు. కేవలం నివేదిక తయారు చేసి ఇవ్వడం మాత్రమే సిట్ బాధ్యత. అవి అలా ఉంచితే అమరావతిలో రైతుల ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

 

రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు వరుస పర్యటనలు చేసారు. అలాగే ప్రజా చైతన్య యాత్రను కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది. దీని ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ యాత్ర విజయవంతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించడం ఖాయంగా కనపడుతుంది. ఇక అమరావతి లో రాజధాని రైతులపై జరిగిన దాడి విషయంలో టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. ఇక విజయవాడ ఎంపీ కేసినేని నానీ ఎన్నార్సీ కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభ సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: