ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న అధికార వైసీపీ ఈ వారం ఎక్కువగా విపక్ష తెలుగుదేశం పార్టీనే టార్గెట్ గా చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు తెలుగుదేశం పార్టీనే లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజా చైతన్య యాత్రను లక్ష్యంగా చేసుకుని టీడీపీ పై వైసీపీ విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడో దశ కార్యక్రమాన్ని కర్నూలు వేదికగా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతీ అత్యాచార కేసుని సిబిఐ కి అప్పగిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

 

ఇక ఐటి దాడుల లక్ష్యంగా వైసీపీ టీడీపీ మీద తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా ఐటి దాడుల్లో రెండు వేల కోట్లకు పైగా అవినీతి బయటపడింది అంటూ వైసీపీ నేతలు టీడీపీ ని టార్గెట్ గా చేసుకున్నారు. ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి రోజా, మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, లక్ష్మీ పార్వతి వంటి వాళ్ళు చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసారు. ప్రజా చైతన్య యాత్రను రోజా పిచ్చోడి యాత్రగా అభివర్ణించారు. ఇక మూడు రాజదానులకు మద్దతుగా వైసీపీ పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసింది. 

 

వైసీపీ సర్కార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వెలిగొండ ప్రాజెక్ట్ ని ఈ వారంలోనే జగన్ సమీక్షించారు. ప్రజా చైతన్య యాత్రను టార్గెట్ గా చేసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఆర్ఎం యునివర్సిటి కి వెళ్ళిన తనను అమరావతి రైతులు అడ్డుకోవడం పై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళను టీడీపీ గూండాలు అన్నారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ని వైసీపీ నేతలు సమర్ధించడం విశేషం

మరింత సమాచారం తెలుసుకోండి: