తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం మీడియా పలు కీలక అంశాలను కవర్ చేసింది. ముఖ్యంగా సంచలన వార్తలతో ఈ వారం మీడియా ఒకరకంగా పండగ చేసుకుంది అనే చెప్పాలి. కంటి వెలుగు నుంచి సిట్ కి అవినీతి అప్పగించడం వరకు ఎక్కువ అంశాలను మీడియా కవర్ చేసింది. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ఎక్కువగా మీడియా ఫోకస్ చేసింది. ఆ సభలో ఆయన రాజధాని గురించి గాని కర్నూలు జిల్లా సమస్యలను గాని ఎక్కడా ప్రస్తావించలేదు. దీని మీద మీడియా కథనాలు రాసింది. 

 

ఇక రాష్ట్ర ప్రభుత్వ౦ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ౦పై కొన్ని విచారణ బృందాలను ఏర్పాటు చేసింది. ఈఎస్ఐ లో అవినీతి 70 కోట్ల మేర జరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై మీడియా ఎక్కువ కథనాలు ప్రసారం చేసింది. ఇకపోతే రాజధాని భూముల విషయంలో సిట్ ఏర్పాటు చేయడం ఈ వారం మీడియాలో ఎక్కువగా హైలెట్ అయింది. రాజ్యసభ సీట్ల విషయంలో కూడా మీడియా ఎక్కువ కథనాలే ఫోకస్ చేసింది. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర మీద కూడా ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. 

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కు సంబంధించి కూడా ఎక్కువ కథనాలు మీడియా ప్రసారం చేసింది. సోషల్ మీడియా కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టింది. తెలంగాణాలో రాజ్యసభ సీట్ల వ్యవహార౦లో పలు చర్చలు చేసింది మీడియా. ఇక చంద్రబాబు మీద జరిగిన ఐటి దాడులు కూడా ఈ వారమే హైలెట్ అయ్యాయి. అదే విధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక మరణం ఈ వారం ఒక సంచలనం. దానిపై ఎక్కువ ఫోకస్ చేసింది మీడియా. అమరావతిలో రోజా కు నిరసన వ్యక్తం చేయడం కూడా ఈ వార౦ హైలెట్.

మరింత సమాచారం తెలుసుకోండి: