సాధారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ అధికార పార్టీదే పై చేయిగానే ఉంటుంది. ఈ వారం కూడా అదే ధోరణి కనిపించింది. అదికార పార్టీ ప్రతిపక్షాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చేరువల నీళ్లు తాగించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో బయటి పడిన ఈ ఎస్‌ ఐ స్కాం రాష్ట్రా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈ స్కాంలో ఉండటంతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దూకుడు పెంచెంది. అచ్చెన్నాయుడు టార్గెట్గా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

Image result for atchannaidu
స్కాంలో గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొంతమంది ఇన్వాల్వ్‌ అయ్యారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో జగన్‌ ప్రభుత్వం సక్సెస్‌ అయ్యింది. ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు తాజా పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్వయంగా అచ్చెన్నాయుడు లెటర్‌ ఇచ్చి మరి క్రాంటాక్ట్ తనకు సంబంధించిన కంపెనీకి ఇప్పించుకున్నాడని పక్కా ఆదారాలు బయటపడటంతో ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నారు.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VISAKHAPATNAM' target='_blank' title='vizag-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vizag</a> million towers
మరోవైపు సచివాలయం తరలింపు విషయంలోనూ ప్రతిపక్షానికి ఝలక్‌ ఇచ్చింది జగన్‌ గవర్నమెంట్‌. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఓ వార్త ప్రముఖం వినిపించింది. వైజాగ్‌లోని మిలీనియం టవర్స్‌ లో సచివాలయం ఏర్పాటుకు నేవీ అధికారులు అభ్యంతరం తెలిపినట్టుగా ఓ వర్గం మీడియా ప్రచారం చేసింది. అయితే వార్తలపై వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. నేవీ అధికారుల తోనే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ స్టేట్మెంట్‌ ఇప్పించి తెలుగుదేశం పార్టీ మీద మరో బాంబు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: