భార్య భర్తలు అన్నాక ఎంత అన్యోన్యంగా ఉన్న అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు భార్యభర్తలిద్దరు సర్దుకుపోతూ ఉండాలి. కానీ చిన్న గొడవ ని పెద్దగా చేసుకుంటే మాత్రం భార్యాభర్తల మధ్య ఎంతో దూరం పెరిగిపోతూ ఉంటుంది.ఇక చిన్న చిన్న గొడవలకి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎంతో నష్టం జరిగి పోతూ ఉంటుంది. కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా మనస్తాపం చెంది ప్రాణాలు సైతం తీసుకుంటూ ఉంటారు. ఆవేషంలో  ఏ నిర్ణయం తీసుకోకూడదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. భర్త ఇంట్లో అన్నం తినడం లేదని మనస్తాపానికి గురైన భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం  చేసింది. 

 

 వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో ఓ భార్య తన భర్త ఇంట్లో అన్నం తినడం లేదు అంటూ ఆవేదన చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది . ఈ ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సాయి బాన్  పేట గ్రామానికి చెందిన మంజుల రమేష్ దంపతులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉంటున్నారు. అయితే మూడు నెలల క్రితం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో భార్య పై అలిగిన భర్త ఇంట్లో తినడం లేదు. బయట తినేసి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఒండి పెట్టినప్పటికీ భర్త తనతో మాట్లాడటం లేదు తినడం లేదు అంటూ మనస్తాపానికి గురైంది భార్య మంజుల. 

 

 

 ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే గుర్తించిన స్థానికులు ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు.సమాచారం  అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన భార్య మంజుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే చిన్న చిన్న విషయాలకు అనాలోచిత  నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: