ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయం కాస్త హీట్ గా ఉంది. రాజధాని వ్యవహారం ఇంకా మండుతూనే ఉంది. అధికార పార్టీ నేతలు దీనిపై చేసే ప్రకటనల విషయంలో కాస్త వెనక్కి తగ్గినా రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళనలు ఇప్పుడు తీవ్రంగానే ఉన్నాయి. ఈ వారం కొన్ని రాజకీయ వివాదాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, వైసీపీ నేతల వ్యవహారశైలి, టీడీపీ నేతల మీద చేస్తున్న అవినీతి ఆరోపణలతో ఏర్పాటు చేసిన సిట్ వివాదంగా మారాయి. 

 

వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని చుట్టూ రాజకీయం తిరుగుతుంది. కోటప్ప కొండ వేదికగా వీరి మధ్య గొడవ బయటపడింది. ఎన్నికలకు ముందు నుంచి వీరి మధ్య గొడవలు ఉన్నాయి. ఇప్పుడు అవి బయటపడ్డాయి. రజని మరిది గోపీ మీద దాడి చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎమ్మెల్యే ఉన్నారు అనుకుని జరిగిన దాడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. లావు వర్గమే తమ మీద దాడి చేయించింది అని రజని వర్గం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తుంది. 

 

దీనిపై ముఖ్యమంత్రి జగన్ కూడా జోక్యం చేసుకున్నట్టు సమాచారం. ఇక గత వారం అమరావతి రైతుల విషయంలో పోలీసులు చూపించిన అత్యుత్సాహం కూడా వివాదాస్పదంగా మారింది అనే చెప్పవచ్చు. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పది మంది అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వివాదంగా మారింది. పోలీస్ స్టేషన్ అధికారాలు సిట్ కి ఉంటాయని చెప్పడం సంచలనం. దీనిపై న్యాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తునారు. సిట్ అనేది విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది గాని పోలీస్ స్టేషన్ అధికారాలు ఉండటం ఏంటీ అంటున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మీద సిట్ ఏర్పాటు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: