రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు రాబోతున్నారనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో పరోక్షంగా బీజేపీ పార్టీపై విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా బీజేపీని ఎగతాళి చేస్తూ ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది. కాంగ్రెస్  ట్వీట్ లో  దేశంలోని ప్రధాన సమస్యలైన ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం గురించి బీజేపీ పార్టీని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేసింది. 
 
కాంగ్రెస్ " బీజేపీ పార్టీ ట్రంప్ కు చేయి ఊపడానికి 69 లక్షల ఉద్యోగాలను ప్రకటించింది. త్వరగా దరఖాస్తు చేసుకోండి" అంటూ ట్వీట్ చేసింది. రేపు ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుండి మొతేరా స్టేడియం వరకు భారీ ర్యాలీ జరగనుంది. ట్రంప్ ఇటీవలే మోదీ తనకు 70 లక్షల మందితో ఘన స్వాగతం పలకబోతున్నారని ట్వీట్ చేశారు. ట్రంప్ కు బీజేపీ పార్టీ ఎందుకు అంత విలువ ఎందుకు ఇస్తోందంటూ కాంగ్రెస్ బీజేపీపై మండిపడుతోంది. 
 
కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శల్లో భాగంగా 2014 సంవత్సరంలో మోదీ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన చేశారని అందులో భాగంగా ట్రంప్ కు ఆహ్వానం పలకటానికి 69 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నారని బీజేపీ  ట్రంప్ వచ్చే సమయంలో చేయి ఊపుతూ స్వగతం పలికే ఉద్యోగం కల్పిస్తోందని విమర్శలు చేసింది. జీతం అచ్చేదిన్ (మంచి రోజులు) అని వ్యంగ్యంగా కాంగ్రెస్ ప్రకటన రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన తరహా పోస్టర్ ను తయారు చేసి రిలీజ్ చేసింది. 
 
కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ పోస్ట్ గురించి బీజేపీ పార్టీ మండిపడుతోంది. బీజేపీ పార్టీ నేతలు ఇతర దేశాల అధ్యక్షుల పర్యటనలు మన దేశ గొప్పదనాన్ని, హుందాతనాన్ని ప్రపంచానికి తెలియజేయటానికి వేదికలుగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ మాత్రం భారతీయులను అవమానించే విధంగా పోస్టులు పెడుతోందని  విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: