ఒక్కసారి మీ చిన్ననాటి బాల్యంలోకి వెళ్లండి.. ఇప్పుడు 40వ పడిలో పడిన వాళ్లంతా.. దాదాపుగా చిన్నప్పుడు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవాళ్లే.. ఎందుకంటే, మనమంతా అలాంటి మామూలు ఊర్ల నుంచి వచ్చిన వాళ్లమే. అక్కడున్న సాదాసీదా సర్కారీ బళ్లలో చదువుకున్న వాళ్లమే. బడి అంటే చదువే కాదు. అది మన బాల్యపు జీవితం. ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం ప్రభుత్వానికి సంబంధించినవి మాత్రమే కావు. అవి ఊరి ప్రజల ఉమ్మడి ఆస్తి.

govt <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SCHOOL' target='_blank' title='school-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>school</a> in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELANGANA' target='_blank' title='telangana-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telangana</a> కోసం చిత్ర ఫలితం

ఒక్కసారి చిన్ననాటి బడి గుర్తొస్తే.. మన బాల్యం మన కళ్ల ముందు నిలుస్తుంది.. బడులు తరాల అంతరాలను పూడుస్తూ సగర్వంగా నిలిచే వారసత్వ చిహ్నాలు. మనలను వేలు పట్టి బాల్యంలోకి నడిపించే తీపి జ్ఞాపకాలు. మన పిల్లలను గౌరవనీయ ఉన్నత శిఖరాలకు పంపిన విజయ సోపానాలు. మన ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించిన ఉద్యోగ కేంద్రాలు. మన సామూహిక సామాజిక ప్రగతికి చెరగని గురుతులు. మరి అలాంటి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకు మనమంతా నడుంబిగించాలి.

govt <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SCHOOL' target='_blank' title='school-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>school</a> in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELANGANA' target='_blank' title='telangana-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telangana</a> కోసం చిత్ర ఫలితం

మీ పాఠశాల ఎలా ఉందో కనుక్కోండి. దానికి ఏంకావాలో కనుక్కోండి. ఆ బడిలో చదివిన మీ స్నేహితులను వాకబు చేయండి.. పేరు ప్రభుత్వ పాఠశాల అయినంత మాత్రాన వాటికి సంబంధించిన అన్ని పనులనూ ఒక్క ప్రభుత్వమే చేయలేదు. అలా చేయాలని అనుకోవడమూ సరికాదు. పాఠశాలలకు ప్రభుత్వం భవనాలు కట్టిస్తుంది. ఉపాధ్యాయులను నియమిస్తుంది. వాళ్లకు జీతాలు ఇస్తుంది. ప్రభుత్వం నిధులు ఇస్తూ తన విధిని నిర్వర్తిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చాలావరకు చదివేది పేద పిల్లలే. వారిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావడంలో ప్రభుత్వంతో పాటు సమాజానికీ అంతే బాధ్యత ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఒక స్థాయికి చేరిన మనం ఆ పాఠశాలకు ఇప్పుడు ‘ఫీజు’ కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా చేయడంలో అంతులేని తృప్తి కూడా ఉంది. కాదంటారా..? అందుకే మీ పాఠశాలను ఒక్కసారి పలకరించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: