చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు అసభ్యరీతిలో ప్రవర్తిస్తుండటంపై ఈ మద్య కళాశాల యాజమాన్యాలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంటుంది.  నూజివీడు ట్రిపుల్‌ ఐటీ మహిళా హాస్టల్లో యువకుడు చొరబడి ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. లేడీస్‌ హాస్టల్లో పట్టుబడ్డ యువకుడు కూడా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థేనని తెలిసింది. అసలు ఆ విద్యార్థి హాస్టల్ రూమ్ లోకి ఎలా దూరాడు.. మంచం కింద ఎలా దాక్కున్నాడు అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని కళాశాల యాజమాన్యం చెప్పారు.  విద్యార్థిని సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే విద్యార్థినులకు కేవలం కౌన్సెలింగ్‌ మాత్రమే ఇచ్చి పంపించివేశారని, యువకుడికి కూడా కౌన్సెలింగ్‌తో సరిపెట్టారని సమాచారం. దీంతో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో కాలేజ్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

 

సహ విద్యార్థినులు, విద్యార్థులు కూడా ఈ ఘటనపై నిరసనలు తెలిపారు. ఇక రాత్రంతా గడిపిన అబ్బాయి ఉదంతం తీవ్ర కలకలం రేపగా, ఇద్దరి తల్లిదండ్రులనూ పిలిపించిన వర్శిటీ యాజమాన్యం, వారిని కళాశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.  ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించిన వర్శిటీ రిజిస్ట్రార్, వారిని తల్లిదండ్రులకు అప్పగించి, కాలేజీ నుంచి పంపించి వేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కళాశాల ఉన్నతాధికారులు తెలిపారు. 

 

పిల్లల భవిష్యత్ పాడవుతుందనే మౌనంగా ఉన్నట్లు చెప్పారు. బయటి నుంచి కిటికీ తీయడం చాలా కష్టమని, లోపలి నుంచి ఓపెన్ చేయటం సులువని తెలిపారు. లోపల ఉన్న వ్యక్తే కిటికీ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. ఫెస్ట్ జరుగుతున్న సమయంలో  విద్యార్థి ఈ పని చేశారని కళాశాల యాజమాన్యం పేర్కొంది.   లేడీస్ హాస్టల్ భద్రతను పెంచుతున్నామని వార్డెన్, సెక్యూరిటీ గార్డులపై విచారణ జరుగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 16వ తేదీ రాత్రి, కిటికీ గుండా అమ్మాయి గదిలోకి ప్రవేశించిన అబ్బాయి, రాత్రంతా ఆమెతోనే గడపగా, ఉదయం పూట అతన్ని గమనించిన మరో అమ్మాయి, అతన్ని పట్టించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: