నిజామాబాద్‌లో పార్టీని మ‌రింత బలోపేతం చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది.  ప్ర‌జాబ‌లం ఉండి.. వివాద ర‌హితుడిగా పేరున్న నేత‌ల కోసం అన్వేషిస్తోంది.  ఈక్రమంలోనే మాజీ  స్పీక‌ర్‌, టీఆర్ఎస్ నాయకుడు సురేశ్‌రెడ్డిపై ఆపార్టీ దృష్టి సారించింది. సురేశ్‌రెడ్డిని త‌మ పార్టీలో  చేర్చుకుంటే జిల్లాలో ప‌ట్టు సా ధించ‌వ్చ‌ని బీజేపీ భావిస్తోంది. ఈక్ర‌మంలోనే సురేశ్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్య‌త‌ల‌ను ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు అప్ప‌గించింది. చాలా మంది కాంగ్రెస్ నాయ‌కుల్లాగానే సురేశ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పి టీఆర్ ఎస్‌లో చేరారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయ‌న‌కు పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తార‌ని, ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌ని అంతా భా వించారు.



అయితే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి కూతురు క‌విత ఓట‌మి పాల‌వ‌డంతో సీన్ రివ‌ర్స్ అ యింది. ఈ ఎన్నిక‌ల్లో డీఎస్ కుమారుడు ధ‌ర్మ‌పురి అర్వింద్ గెల‌వ‌డంతో కేసీఆర్ సురేశ్‌రెడ్డిని దూరం పెట్టిన‌ట్లు స‌మాచారం.క‌విత ఓట‌మి కార‌ణంగా టీఆర్ ఎస్‌లో సురేశ్‌రెడ్డి ప్రాధాన్యం కూడా బాగా త‌గ్గిపోయింది. అయితే టీఆర్ ఎస్‌లో ప‌ద‌వి కోసం ఎప్ప‌టి నుంచో వేచి చూస్తున్న మాజీ స్పీక‌ర్ ... త‌న‌కు తాను డెడ్ లైన్ పె ట్టుకున్నార‌నే ప్ర‌చారం జరుగుతోంది. త‌న‌కు ఎమ్మెల్సీ లేదా రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌క‌పోతే సురేశ్‌రెడ్డి మూడు నెల‌ల్లోనే పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  


ఈ క్ర‌మంలోనే అధికార పార్టీతో అంటీ ముట్ట‌న్న‌ట్లుగా ఉన్న సురేశ్‌రెడ్డి క‌మ‌లం గూటికి చేరేందుకు ఆస‌క్తి స‌మాచారం. ఇదే అద‌నుగా బావిస్తున్న ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు సురేశ్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకురావాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. త‌న తండ్రి డీఎస్ ద్వారా ఆయ‌న ఇప్ప‌టికే సురేశ్‌రెడ్డితో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి జిల్లాపై పూర్తి ప‌ట్టు సాధించేందుకు ఇటు బీజేపీ.. అటు ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్  ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో నిజామాబాద్ రాజ‌కీయాల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: