పెళ్లి సందడి సినిమాను మరలా చూపించాలి అనుకొన్నాడేమో ఈ వ్యక్తి. అక్కడ హీరో చెల్లిని ప్రేమించి అక్కను పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. కానీ ఇక్కడ హీరో మాత్రం అక్కతో ఉంటూనే చెల్లికి వల వేశాడు. ఇద్దరికి తెలియకుండా అక్కాచెల్లెళ్ల జీవితాలను ఏలుద్దాం అనుకున్నాడేమో ఈ ధీరుడు. ఆ వ్యక్తి ఏం ఆలోచించాడో తెలియదు కానీ చెల్లిని పెళ్లి చేసుకొని అక్కకి షాక్ ఇచ్చాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలో చోటు చేసుకుంది. 

 

పశ్చిమ బెంగాల్‌ లోని కోల్ కత్తాకు చెందిన ఓ వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాలతో ఆడుకున్నాడు. అక్కతో ఐదేళ్లు సహజీవనం చేసిన యువకుడు ఆమె చెల్లిని రసహ్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్‌ లో యువకుడి తల్లి పేరును కూడా చేర్చారు.

 

కోల్‌కతాకు చెందిన ఓ యువతికి 2015 లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అనేక ప్రాంతాలు తీసుకెళ్తూ ఐదేళ్ల పాటు యువతిని లైంగికంగా దోచుకున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువకుడి తల్లి సైతం ఆమెపై దాడికి పాల్పడి.. తన కొడుకు జోలికి రావొద్దని హెచ్చరించింది.

 

కొద్ది రోజులుగా యువతితో అన్ని సంబంధాలు తెంచకున్న యువకుడు గత ఆదివారం ఆమె చెల్లిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడు, ఆమె తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు కుటుంబాల నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: