ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చికెన్ తినాలి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఓవైపు చైనాలో కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చికెన్ తినడం వల్ల... కరోనా  వైరస్ సోకుతుంది అనే.. తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి... ఈ క్రమంలోనే చికెన్ తినాలంటే చాలామంది జంకుతున్నారు. అయితే కరోనా వైరస్ కోళ్లకు సోక  లేదని అధికారులు తెలిపారు. సరే అధికారులు చెప్పారు కదా అని చికెన్ తినడానికి రెడీ అవుతున్న సమయంలో కోళ్లకు మరో మాయదారి వైరస్ సోకి... కోళ్ళని చనిపోతున్నాయి. దీంతో మరోసారి చికెన్ తినడం తగ్గించారు ప్రజలు. 

 

 

 

 ఇప్పటికీ అంతుచిక్కని వైరస్ సోకి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం బయ్యన గూడెం లో కోళ్లు వరుసగా సరిపోతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 30 వేల కోళ్లు చనిపోయాయి అని పౌల్టీ  యజమానులు తెలిపారు. అంతుచిక్కని వైరస్ కారణంగా చనిపోతున్న కోళ్ళతో తమాకు  అపార నష్టం కలుగుతుంది అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. తమ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు పౌల్ట్రీ యజమానులు. లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కోళ్ల ఫారాలు వేసి కోళ్లను  పెంచుతున్నామని కానీ ఇప్పుడు చనిపోతున్నాయి అంటూ తెలిపారు.

 

 

 

 అయితే భారీ సంఖ్యలో చనిపోతున్న ఈ కోళ్ళన్నింటిని బయ్యన గూడెం గ్రామ సమీపంలోని అగ్రహారం గ్రామంలో చెరువు పక్కన  గోతులు తీసి వాటిలో వేస్తున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. అయితే గోతులు తీసి గోతుల్లో చనిపోయిన కోళ్లను వేస్తున్నారు గానీ పైన మాత్రం మట్టి కప్పడం లేదు ఈ నేపథ్యంలో ఊర్లోని కుక్కలని అక్కడ పడేసిన కోళ్లను పట్టుకొచ్చి గ్రామంలో అంతా పాకేస్తున్నాయి. దీంతో గా మొత్తం దుర్వాసన మయం కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చనిపోయిన కోళ్లను  ఊరికి దూరంగా పూడ్చేయాలి  అంటూ ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు గ్రామస్తులు. ఇదిలా ఉంటే అసలు కోళ్లకు వస్తున్న వైరస్ ఏమిటి అనేది మాత్రం అంతుచిక్కని విధంగా ఉంది. ఇక వరుసగా భారీ మొత్తంలో కోళ్లు చనిపోవడంతో అధికారులు కూడా అయోమయంలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: