ఈ మధ్యకాలంలో జనాలు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు.. అదేదో మంచి చేయడానికి కాదండోయ్... చెడు చేయడానికి. ఏదో ఒకటి  చేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు... జనాలు చూపిస్తున్న క్రియేటివిటీ చూస్తుంటే నోరెళ్లబెట్టాల్సిందే. ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న డ్రగ్ మాఫియా... పోలీసులకు దొరక్కుండా డ్రగ్స్ సప్లై చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అబ్బో వీరి వినూత్న ఆలోచనలకు సరికొత్త క్రియేటివిటీకి చూస్తుంటే.. ఇది కాస్త మంచి పనుల్లో పెట్టుంటే  బాగుపడే వారేమో అనిపిస్తూ ఉంటుంది. దీంతో కొత్తగా ఆలోచిస్తూ డ్రగ్  మాఫియాని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దీంతో డ్రగ్ మాఫియా ని పట్టుకోవడం పోలీసులుకు రోజురోజుకు సవాల్గా మారుతోంది. 

 

 

 అయితే డ్రగ్స్ మాఫియాని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా... ఎంత పటిష్టంగా గస్తీ కాస్తున్నా... డ్రగ్ మాఫియా మాత్రం పోలీసులకు దొరక్కుండా కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నారు.  అయితే ఇప్పటికే ఎన్నోసార్లు పోలీసులకు అడ్డంగా పట్టుబడి జైలుపాలు అయినప్పటికీ కూడా... డ్రగ్ మాఫియా ఎక్కడా తగ్గడం లేదు మరింతగా రెచ్చిపోయి మరీ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఇక ఈ సారి అయితే కేటుగాళ్లు పోలీసులకు పట్టు పడకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించి మరి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. 

 

 

 కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యి  మరోసారి పోలీసులకు పట్టుబడ్డారు. సరి కొత్తగా ఆలోచించి పోలీసులకు దొరక్కుండా డ్రగ్  సరఫరా చేస్తున్న కేటుగాళ్లను  పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. పోలీసుల చెకింగ్  లో భాగంగా పెళ్లి కార్డులు తరలిస్తున్న బ్యాగ్ బరువుగా ఉండడంతో అనుమానం వచ్చి చెక్ చేయగా పోలీసులు షాక్ అయ్యారు. పెళ్లి పత్రికలను  ఓపెన్ చేసిన అధికారులకు.. కేజీలకు కేజీలు డ్రగ్స్ దొరికింది. బెంగళూరు నుంచి ఆస్ట్రేలియా తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ ఘటనలో  ఐదు కోట్ల విలువైన డ్రగ్స్ పోలీసులకు పట్టుబడటంతో  ఈ ఘటన పెద్ద దుమారమే రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: