ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆన్లైన్ వెంట పరుగులు పెడుతుంది. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ తో ఏం కావాలన్నా మనిషి ఇంటికి వచ్చి వాలి పోతున్నాయి. దీని కోసం ఎంతో కష్టపడాల్సినా పని లేదు. స్మార్ట్ ఫోన్ తీసి ఒక్క క్లిక్ చేస్తే చాలు. ఇక విదేశాల్లో ఉన్న వారితో అయినా మాట్లాడడానికి ప్రస్తుతం ఎన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చాయి. దీంతో రోజురోజుకు జనాలు డైరెక్ట్ గా  మాట్లాడటం కంటే ఫోన్ ద్వారా మాట్లాడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లను ఆకర్షించేందుకు ఎన్నో సరికొత్త మెసేజ్ యాప్ లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది వాట్సాప్. రోజురోజుకు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతుంది. 

 

 

 అటు  వాట్సప్ కూడా సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అయితే వాట్సప్ లో ఇప్పటికే ఎన్నో ఫీచర్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాట్సాప్లో మనం ఎవరికైనా పోస్ట్ చేసిన మెసేజ్లను చదివారా లేదా అని తెలుసుకోవడానికి బ్లూ టిక్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. అయితే మనం పంపించిన మెసేజ్ కి అవతలి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అని లేదా అన్నది పక్కన పెడితే.. వాళ్ళు మనం పంపిన మెసేజ్ చదివారా అన్నది మాత్రం తెలిసిపోతుంది. అయితే ప్రైవసీ టీచర్స్ లో భాగంగా ఎదుటి వ్యక్తి... బ్లూ టిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసి ఉంటే మాత్రం మనం పోస్ట్ చేసిన మెసేజ్ లో వాళ్లు చదివారు లేదో తెలుసుకోవడం మాత్రం కష్టం. 

 

 

 అయితే ఒకవేళ మీరు మెసేజ్ చేస్తున్న వ్యక్తి బ్లూ టిక్స్ ఆప్షన్ని ఆఫ్ చేసి ఉంటే మీ  మెసేజ్ చదివాడో  లేదో తెలుసుకోవాలంటే మీరు చాటింగ్ చేస్తున్న సమయంలో వాయిస్ మెసేజ్ చేయండి.దీంతో ఎదుటి వ్యక్తి మీ వాయిస్ రికార్డింగ్ ను విన్నట్లయితే వెంటనే బ్లూ టిక్స్ పడిపోతాయి. అయితే అతను బ్లూ టిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసినప్పటికీ వాయిస్ మెసేజ్ కు మాత్రం బ్లూటూత్ పడతాయి. అయితే ఇది ఒక రకంగా వాట్సాప్ లోని లోపం అనే చెప్పొచ్చు. మరి మీ స్మార్ట్ఫోన్లో ఇలాంటి ఫీచర్ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: