టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో లైట్ మెట్రో, మోనో రైలు గురించి చర్చలు జరిపామని దీనిపై నివేదిక ఇవ్వాలని తాము కోరామని అన్నారు. అవసరమైతే ఆగమ పండితులతో కూడా నివేదిక వచ్చిన తరువాత లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనల గురించి చర్చిస్తామని అన్నారు. 
 
తీగలపై నడిచే రైలు వంటి వాటి జోలికి తాము వెళ్లడం లేదని మోనో, ట్రామ్ తరహా రైళ్లను మాత్రమే తాము పరిశీలిస్తున్నామని అన్నారు. రైలు ప్రతిపాదనలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమలకు రైలును ఏర్పాటు చేసే అంశాన్ని ఆస్ట్రియాలో ఎత్తైన కొండపైకి వెళ్లే రైలును మోడల్ గా చేసుకొని పరిశీలిస్తున్నామని చెప్పారు. 
 
అజిత్ డోబాల్ పేరుతో టీటీడీకి చెందిన 2300 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని కానీ ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. సోషల్ మీడియాలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోబాల్ పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అది నకిలీ ఖాతా అని అది అజిత్ ఢోభాల్  ఖాతాయే కాదని అన్నారు. టీటీడీ అధికారులు అజిత్ డోబాల్  ఖాతా గురించి పరిశీలన జరిపారని ఆ పరిశీలనలో ఈ విషయం తెలిసిందని అన్నారు. 
 
త్వరలో తిరుమలలో సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఎవరైనా నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో దుష్ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ భద్రతా సలహాదారు పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తాము సహించేది లేదని అన్నారు. కొన్ని రోజుల క్రితం మెట్రో ఎండీ ఎస్వీఎన్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్చలు జరిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: