ప్రతి మనిషి జీవితంలో శృంగారం అన్నది ఓ భాగం అనే చెప్పాలి. చాలా మంది వైద్య నిపుణులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. అయితే శృంగారం మంచిదే కానీ ఏదైనా సరే మితి మీరకూడదు అంటున్నారు. సెక్స్ అంటే ఒకొక్కరిలో ఒక్కో భావన ఉంటుంది. కొంత మందికి సెక్స్ మీద ఇంట్రస్ట్ ఉంటుంది మరికొంత మందికి ఉండదు. అయితే ఒక అమ్మాయి సెక్స్ మీద ఇంట్రస్ట్ ఎక్కువవడంతో ఏకంగా నిద్రలో కూడా సెక్స్ కోసం పరితపించడం కామ పిశాచిలా ప్రవర్తించడం లాంటి వింత వింత పనులు చేస్తోందట.
నిద్రలో ఉండగా శృంగారం ఏంటని అనుమానం వస్తోందా? అయితే ఇది నిజం ఇంగ్లాండుకు చెందిన హేలీ బట్టీ అనే యువతి నిద్రలో కూడా శృంగారం కోరుకుంటుందంట. తాను మాత్రం చక్కగా పడుకుంటూ తన పక్కన ఉన్నవారికి నిద్రలేకుండా చేస్తోందట. ఈ యువతి ‘సెక్సోమ్నియా’ అనే విచిత్ర వ్యాధితో బాధపడుతోంది.
అయితే ఈ జబ్బుకు ఇంకా మందు మాత్రం తయారు కాలేదట. ఈ సమస్య ఉన్నవారు నిద్రలోనే ఏకంగా ఒకటికి నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటానికి ఇష్టపడతారట. అంతే కాక భామస్వాములను బలవంతం చెయ్యడానికి కూడా వెనకాడరట. అంతేకాక అదేదో గజిని సినిమాలో చెప్పినట్లు తెల్లవారాక రాత్రి ఏం జరిగిందో వారికి గుర్తులేకపోవడమే ఈ వ్యాధికున్న విచిత్రమైన లక్షణమట. ఈ అరుదైన జబ్బు ఉన్నవారు తాము నిద్రలో కామ పిశాచిలా ప్రవర్తిస్తుందంటూ తన ప్రియుడు చెప్పినా నమ్మలేదట.
తన గురించి తనకు తెలిసి బాధపడుతున్నానని ఈ అమ్మడు చెబుతోంది. అయితే ఈ రోగం వల్ల తనకు వచ్చిన సమస్య ఏమీ లేదని కాకపోతే శృంగారంలో పాల్గొన్న అనుభూతి కడా తనకు మిగలడం లేదట. అయితే ఇది ప్రపంచం మొత్తంలో నలుగు ఆడవారు, పదకొండు మంది మగవారికి ఈ వ్యాధి ఉన్నట్లు వైధ్యులు నిర్ధారించారు.