ప్రస్తుతం వైసీపీలో సరికొత్త చర్చ మొదలైంది. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా అధిష్టానం ఎవరి నిర్మించబోతోంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా  ఈ పదవి పై జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది నేతలు ఆశలు పెట్టుకున్నారూ.  నెల్లూరు నగరం నుంచి వై.వి రామిరెడ్డి ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన చిరంజీవి రెడ్డి గూడూరు కు చెందిన శ్యాంప్రసాద్ రెడ్డి తదితర పేర్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ పదవిపై ఆశావహులుగా  ఉన్నట్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ వైసిపి అధిష్టానం మాత్రం చైర్మన్ పదవిని దేవసేన కట్టబెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు కీలక నేత అయిన విజయ్ సాయి రెడ్డి మద్దతు తో  ఈమెకు దాదాపుగా చైర్ పర్సన్ పదవి ఖరారైనట్లు   అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది.

 

 

 

 కాగా  నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ పదవి గత ఏడు నెలలుగా ఖాళీగానే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడు నెలల నుంచి ఎంతో మంది నేతలు ఈ చైర్పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసిపి అధిష్టానం దేవసేన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే గతంలోదేవసేన  తెలుగుదేశం పార్టీ తరఫున గూడూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు కౌన్సిలర్ లతో కలిసి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు దేవసేన. అయితే దేవసేన టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి రావడానికి వెనుక మంత్రి అనిల్  ఎంపీ విజయసాయిరెడ్డి ల పాత్ర కీలకంగా ఉంది. 

 

 

 

 అయితే దేవసేన కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నా హామీతోనే వైసీపీ లోకి ఆహ్వానించారు అంటూ... అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా వికేంద్రీకరణ బిల్లుకు శాసనమండలిలో ఇబ్బందులు ఎదురవడం తో... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏకంగా శాసన మండలి రద్దు చేయడానికి తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేవసేన కు గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ  హామీను నిలబెట్టుకోవడానికి... నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టనున్నట్లు సమాచారం. దేవసేన కు చైర్మన్ పదవి కట్టబెట్టినందుకు ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఎంపీలతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తేలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: