అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వస్తున్నాడంటే హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉండే అమెరికాకు అధ్యక్షుడు అంటే ప్రపంచదేశాలకు రారాజు అనే చెప్పాలి. అందుకే ఇప్పటికే అహ్మదాబాద్ లో మురికివాడలు కనపడకుండా గోడలు సైతం కట్టేస్తున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటించే మూడు గంటల పర్యటనకు దాదాపు 110 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పుడే వార్తలు కూడా మారుమోగుతున్నాయి. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే దాని కోసం ఏ రేంజ్ లో ఏర్పాట్లు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో భద్రతతో పాటు అమెరికా నుంచి కూడ భద్రతా దళాలు కూడా ఇప్పటికే భారత్ కు చేరుకుని అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి.


 ట్రంపు భద్రతను చూసే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. భరత్ లోని ఎన్ ఎస్ జి ఇలా మొత్తం అన్ని విభాగాలు రంగంలోకి దిగిపోయాయి. ఆగ్రాను అమెరికా అధ్యక్షుడు సతీసమేతంగా సందర్శించబోతుండడంతో  అక్కడ ప్రత్యేక ఆంక్షలు కూడా విధించారు. అయితే ఇప్పుడు ట్రంప్ భద్రతకు కొండా ముచ్చులను కూడా రంగంలోకి దించారు. ట్రంప్ ఇక్కడ పర్యటించే సమయంలో కోతులు ఎక్కడ అల్లరి చేస్తాయో అని భారత అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కోతుల బెడద బాగా ఎక్కువ. తాజ్ మహల్ సందర్శించడానికి వచ్చే వారి చేతుల్లోని వస్తువులు లాక్కుని వెళ్ళిపోతుంటాయి. 


చాలా కాలంగా ఈ సమస్య ఉన్నా చూసీచూడనట్లుగా అధికారులు వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో పాటు కీలకమైన ప్రజాప్రతినిధులంతా అక్కడికి వస్తుండడంతో కోతుల బెడద నుంచి  తప్పించుకునేందుకు కొండముచ్చులను అధికారులు రంగంలోకి దించారు. కొండముచ్చులు ఉన్న ప్రాంతాల్లో కోతులు సంచరించేందుకు బయపడతాయి. అందుకే ఇప్పుడు తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఐదు కొండముచ్చులను రంగంలోకి దించి తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ ని ఏర్పాటు చేసారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: