అవునండి.. నిజం.. ఇది మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఎలా అంటారా? ఇన్నాళ్లు ఎంతోమంది మందుబాబులు.. సినిమాలు చూసి ఫారిన్ సరుకు అంటే వావ్ అనుకునేవాళ్లే.. జోబులో డబ్బులు ఉన్న సరే.. అది ఎక్కడ ఎప్పుడు ఎలా కొనాలి అనేది తెలియదు.. అలాంటి వారికీ ఇప్పుడు అద్భుతమైన న్యూస్.. 

 

అది ఏంటి అంటే ? ఆన్లైన్ లో ఒక్క క్లిక్ చేసి ఫారిన్ సరుకును తెప్పించుకోవచ్చు.. అయితే ఇది మనకు కాదులే ఆఫర్.. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మందునే బ్యాన్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారు.. ఇక ఫారిన్ సరుకు ఎం వస్తుంది.. నిజానికి అలా బ్యాన్ చెయ్యడమే మంచిది అనుకోండి.. కాకపోతే మందుబాబులకు బాధ.. 

 

సరే ఇది పక్కన పెడితే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్‌లో మద్యం ఆర్డర్ ఇవ్వచ్చు అంటుంది.. ఇప్పుడు ఒక్క మద్యం తప్ప అన్ని ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకునే ఆఫర్ ఉన్నాయి.. అలాంటి ఈ సమయంలో మద్యం కూడా ఆన్లైన్ దొరికేస్తుంది.. 2020-21 సంవత్సరానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ఎక్సైజ్ విధానాన్ని పునరుద్దరించింది. 

 

పునరుద్ధరించిన ప్రకారం రాష్ట్రంలో కొత్తగా మద్యం షాపులు తెరవడానికి ఒక్క షాపుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే.. విదేశీ మద్యం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించింది.  కమల్ నాథ్ ప్రభుత్వం మద్యప్రదేశ్‌ను మద్యం రాష్ట్రంగా మారుస్తున్నారని బీజేపీ నేత ట్విట్ చేశాడు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: