ప్రపంచంలో ఉన్న అందమైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అయితే.. ఈ దేశం ఇప్పుడు అనుకోని సమస్యతో బాధపడుతోంది. ఎన్నడూ లేనంతగా నల్లులు ఫ్రాన్స్ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఏకంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చిందంటే.. అక్కడ నల్లులు ఏ స్థాయిలో విజృంభించాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఓ నల్లి మంచంలో చేరిందంటే అది పెట్టే బాధ అంతా ఇంతా కాదు. అలాంటిది మంచాలు, కుర్చీలు, సోఫాలు, టేబుళ్లు... ఇలా నల్లి ప్రవేశానికి యజమాని అన్నట్టుగా తయారైంది

 

మనుషుల రక్తాన్ని పీల్చే కీటకాల్లో నల్లులు ముందుంటాయి. ఇప్పుడా నల్లులే ఫ్రాన్స్ దేశ ప్రజల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఫ్రాన్స్ లో 1950 తరువాత మళ్లీ ఇప్పుడు నల్లుల బెడద ఎక్కువయ్యే సరికి ప్రాన్స్ దేశం నల్లులపై యుద్ధం ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు 100రోజుల ప్రణాళిక రచయించింది. ఇందులో భాగంగా ఇంట్లో కలుగులో దాక్కున్న ఎలా చంపాలి..? నల్లులు వృద్ధి కాకుండా ఉండాలంటే ఏం చేయాలని అనే సలహాలతో ఓ వెబ్ సైట్ తో పాటు అత్యవసర నెంబర్ ను ఏర్పాటు చేసింది. 

 

 

ఫాన్స్ లో ఉన్న నాలుగు లక్షల ఇళ్లు, హోటళ్లు, అపార్ట్‌ మెంట్లలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన భద్రతా దళంతో నల్లుల్ని ఏరిపారేసేలా ముందుస్తు చర్యలు తీసుకుంది. నల్లులు వల్ల మనం అందరం ఇబ్బంది పడుతున్నాం. ఈ పరాన్నజీవులు చీకటి ప్రదేశాల్లో జీవించేందుకు ఇష్టపడతాయి. మీ సోఫాలు, బెడ్ రూమ్ లలో ఎక్కువగా ఉంటాయి. సిమెక్స్ లెక్టులేరియస్ అని పిలిచే ఈ నల్లులు ఒక్క రాత్రిలో 90 సార్లు మనిషి రక్తాన్ని పీల్చి జీవనం కొనసాగిస్తాయి. అందుకే మనం అందరం కలిసి నల్లలు వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకుందాం.  హోటల్స్, ఇళ్లలో ఉన్న సామాల్ని ఎలా పడితే అలా పడేయకుండా రాకుల్లో భద్రపరిస్తే నల్లుల్ని నివారించొచ్చు. ప్రజలందరు తమ సెకండ్ హ్యాండ్ దుస్తులను 60 డిగ్రీల సెల్సియస్ లో భద్రపరిచేలా చూడండి అంటూ వెబ్ సైట్ లో ప్రచారం చేస్తుంది. ఇక  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెంబర్ కు ఫోన్ చేస్తే నల్లుల్ని ఎలా తరిమికొట్టాలి అనే అంశాలపై వివరించే ప్రయత్నం చేస్తుంది.

 

 

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రజలు డిక్లోరో డిఫెనిల్ ట్రైక్లోరోఎథేన్ అని పిలవబడే అత్యంత ప్రమాదకరమైన పురుగుల మందును పంటలకు ఉపయోగించే వారు. ఆ మందు వల్ల నల్లులు కనమరుగయ్యాయి. అయితే ఆ తరువాత డీడీటీని ఫ్రాన్స్ దేశంలో బ్యాన్ చేశారు. అప్పటి నుంచి నల్లులు విజృంభించడం ప్రారంభించాయి. తొలిసారి 2018లో పారిస్‌ లో నల్లులు అధికం కావడంతో వీటిపై యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నల్లులను చంపే ప్రత్యేక దళాన్ని అక్కడి అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. తాజాగా ఫ్రాన్స్ నల్లులపై  మళ్లీ యుద్ధం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: