గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం టిడిపి నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా ? ఇందుకే వైసిపి ఎంఎల్ఏ విడదల రజనీ కారులో ఉందనుకునే ప్రత్యర్ధులు ఎటాక్ చేశారా ? ఎటాక్ జరగ్గానే ముందు అందరూ ఇలాగే అనుకున్నారు.  కానీ  జిల్లాలోని న్యూట్రల్స్ అంటే ఏ రాజకీయపార్టీతో కూడా సంబంధం లేని వాళ్ళు చెప్పే విషయం మాత్రం ఇంకోలాగుంది. ఇది వైసిపి-తెలుగుదేశంపార్టీల మధ్య గొడవ కాదట. సామాజికవర్గాల  మధ్య మొదలైన ఆధితప్య గొడవగా  చెబుతున్నారు. అందుకనే రజనిపై దాడి జరిగినట్లు చెప్పుకుంటున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే నియోజకవర్గంలో మొదటి నుండి కమ్మ సామాజికర్గానిదే ప్రధానంగా ఆధిపత్యం. అంటే సామాజికవర్గల జనాభాతో పనిలేకుండా రాజకీయ ఆధిపత్యం మాత్రం కమ్మోరిదే. అందుకనే నియోజకవర్గంలో మొదటి నుండి కమ్మోరు మాత్రమే ఎంఎల్ఏలుగా ఉంటున్నారు. పార్టీ ఏదైనా కావచ్చు ఎంఎల్ఏగా మాత్రం మెజారిటి కమ్మోరే గెలిచారు.

 

ఇలాంటి నేపధ్యంలోనే  2014లో టిడిపి తరపున రెండోసారి గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా మంత్రే అయిపోయారు. ఈ నేపధ్యంలోనే ముందు టిడిపిలో చేరి తర్వాత టికెట్ దక్కదన్న విషయం తెలుసుకుని విడదల రజని వైసిపిలో చేరారు. తర్వాత మారిన పరిస్ధితుల్లో 2019 ఎన్నికల్లో  వైసిపి తరపున పోటిచేసి,  ప్రత్తిపాటిని సవాలు చేసి ఏకంగా ఎంఎల్ఏనే అయిపోయారు.  ఓటమి అన్నది ప్రత్తిపాటి ఏమాత్రం ఊహించని పరిణామమం.

 

దాంతో ప్రత్తిపాటి, టిడిపితో పాటు మొత్తం కమ్మోరంతా షాక్ కు గురయ్యారు.  నియోజకవర్గంలో కార్యక్రమం ఏదైనా అగ్రతాంబూలం మాత్రం కమ్మోరిదే. అలాంటిది కోటప్పకొండలో ప్రభలు వెలిగించటం లాంటి కార్యక్రమాన్ని బిసి ఎంఎల్ఏ చేయటాన్ని కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారట. ఇందుకే కోటప్పకొండ ఆలయం నుండి తిరిగి వస్తున్నపుడు ఎంఎల్ఏ ఉందనుకునే కారుపై దాడి చేశారు.

 

అంతకుముందు వరకూ నియోజకవర్గం మొత్తం మీద కమ్మోరికి ఏపని ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా  ఎంఎల్ఏ దగ్గరకు వెళ్ళి పనులు చేయించుకునేవారట. అలాంటిది మొదటిసారిగా బిసి అందునా మహిళా ఎంఎల్ఏ దగ్గరకు వెళ్ళాల్సిరావటాన్ని కమ్మోరు తట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. పైగా విడదల రజని స్పీడును కూడా తట్టుకోలేకపోతున్నారట. అంటే పైకి కనిపిస్తున్నది పార్టీ పరమైన దాడే కావచ్చు కానీ లోతుల్లోకి వెళితే మాత్రం సామాజికవర్గాల మధ్య ఆధిపత్య గొడవలే అన్న విషయం అర్ధమవుతోంది. ఇక్కడ కమ్మోరును టిడిపిని విడిగా చూడలేరు. అందుకనే  టిడిపిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: