ఏపీలో కొత్త రేషన్, పెన్షన్ కార్డులు పంపిణీ చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ కొత్త కార్డులు జారీ చేసే భాగంగా అర్హులు, అనర్హులని గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే వాలంటీర్లు వెరిఫికేషన్ చేసి, అర్హులని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పెన్షన్‌లకు సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాలని విడుదల చేశారు. అయితే ఇందులో పెన్షన్ అర్హత ఉన్నవారిని కూడా అనర్హులు జాబితాలో పడేశారు. కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఇక దీనిపై జగన్ స్పందించి మళ్ళీ వెరిఫికేషన్ చేసి, పెన్షన్ అర్హులని గుర్తించాలని కోరారు.

 

అయితే పెన్షన్ల పరంగా ఇబ్బందులు తక్కువే ఉన్న, రేషన్ కార్డులు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా రేషన్ కార్డుకు అర్హులు అవ్వాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే.  కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటితే, మూడు ఎకరాల పైబడి మాగాణి భూమి, 10 ఎకరాల పైబడి మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డులు పొందడానికి అనర్హులు. వీటితో పాటు అనర్హులని గుర్తించడానికి పలు నిబంధనలు పెట్టారు. అవి కాసేపు పక్కన బెడితే, ఈ భూములు విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

 

నిబంధనలు ప్రకారం వెళితే చాలమందికి రేషన్ కట్ అవుతుంది. ఇప్పటికే రేషన్ కార్డులకు అనర్హులైన వారు గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు అంత భూములు మాకు లేవని, అయిన కార్డులు ఎలా తీసేస్తారంటూ జగన్ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. అయితే గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఆధార్‌తో భూములు అనుసంధానం జరిగినప్పుడు చాలా తప్పులు జరిగాయి. భూములు సరిగా అనుసంధానం జరగక, కొందరికి లేని భూములు వచ్చి పడ్డాయి.

 

అలాగే తండ్రికి భూములు ఉంటే, పెళ్ళైన కొడుకుకు రేషన్ పోతుంది. వారి పేరు మీద కూడా అవే భూములు చూపిస్తున్నాయి. ఇలా కూడా రేషన్ కార్డులు పోతున్నాయి. ఇక ఆ తప్పులని ఇప్పుడు జగన్ ప్రభుత్వం సరిచేసి, మళ్ళీ అర్హులని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈలోపే కొందరు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మొత్తానికి బాబు ప్రభుత్వం చేసిన పాపం, జగన్ ప్రభుత్వానికి చుట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: