తెలంగాణ లో త్వరలోనే రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి . కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు , టీడీపీ తరుపున ఎన్నికై,  ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న గరికపాటి మోహన్ రావు  లు ఏప్రిల్ రెండవ తేదీన రిటైర్ కానున్నారు . ప్రస్తుతం అసెంబ్లీ పార్టీ బల, బలాలను పరిశీలిస్తే రెండు స్థానాలు అధికార టీఆరెస్ లోకి వెళ్లనున్నాయి . టీఆరెస్ లో రాజ్యసభ స్థానాల కోసం తీవ్ర పోటే నెలకొంది . ఆంధ్ర ప్రదేశ్ కోటా రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేయనున్న టీఆరెస్ రాజ్యసభ పక్ష నేత కేశవ రావు మరోసారి, రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు .

 

కేశవ రావు మాత్రమే కాకుండా , లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీతారాం నాయక్ , మందా జగన్నాధం తో పాటు నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఓటమి పాలయిన కవిత కూడా రేసు లో ఉన్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం రాజ్యసభ టీఆరెస్ కు ఏడు మంది సభ్యుల బలం ఉండగా , అందులో ఎస్సి, ఎస్టీ లకు ప్రాతినిధ్యం అన్నది లేదు . దాంతో ఈసారి ఎస్సి , ఎస్టీలకు కేసీఆర్ అవకాశం కల్పించవచ్చుననే వాదనలు విన్పిస్తున్నాయి . అదే జరిగితే సీతారాం నాయక్ , మందా జగన్నాధం లో ఒకరికి అవకాశం కల్పించవచ్చునని టీఆరెస్ వర్గాలు చెబుతున్నాయి .

 

సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధినేత హామీ మేరకు, పోటీకి దూరంగా ఉన్నారు . అదే విధంగా సీతారాం నాయక్ కూడా పోటీకి దూరంగా ఉండడంవల్ల  , వీరిద్దరికి రాజ్యసభ పదవులు  దక్కే అవకాశాలు లేకపోలేదని వాదనలు విన్పిస్తున్నాయి . అదే జరిగితే కేశవ రావు , కవిత పరిస్థితి ఏంటన్నది పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: