వైఎస్ఆర్సిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెరపైకి తెచ్చిన 3 రాజధానుల నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. జగన్ తెలిపిన ఈ నిర్ణయానికి రాజధాని అమరావతి ప్రాంతం నుండి తీవ్రంగా వ్యతిరేకత రావడం జరిగింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కోసం భూములు ఇచ్చిన రైతులు జగన్ ని విమర్శిస్తూ రాజధాని ప్రాంతంలో ధర్నాలు మరియు నిరసనలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతల దృష్టికి తీసుకెళ్లాలని కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో అమరావతి ప్రాంతంలో రాజధాని మహిళల ఇళ్లపై ఏపీ పోలీసు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తూ వారు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు చిత్రీకరిస్తున్నట్టు రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఆరోపించడం జరిగింది.

 

సరిగ్గా ఆడవాళ్లు స్నానాలు చేస్తున్న సమయంలో డ్రోన్ కెమెరాలను ఇళ్లపై ఉపయోగించటం చూస్తుంటే మేమేదో టెర్రరిస్టు లాగా చిత్రీకరిస్తు ఆంధ్రప్రదేశ్  పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన రైతులు మండిపడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై వచ్చిన ఆరోపణల విషయంలో ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. వస్తున్న వార్తలు అవాస్తవమని రాజధాని ప్రాంతంలో ప్రజల ఇళ్ళపై డ్రోన్ కెమెరాలు ఉపయోగించ లేదని పోలీసులపై మరీ అంత దిగజారి విమర్శలు చేయడం సరికాదన్నారు హోం మంత్రి మేకతోటి సుచరిత.

 

దిశ లాంటి చట్టాలతో మహిళలకు భరోసా కల్పిస్తున్న జగన్ సర్కారుపై ఇలాంటి ఆరోపణలు చెయ్యటం బుద్ధి తక్కువ పని అని విమర్శలు చేశారు. పోలీసుల పనితీరుపై దుష్ప్రచారం చేయడం సరికాదని తన శాఖ ఉద్యోగులకు బాసటగా నిలిచారు.  అసలు ఆరుబయట కనబడేలాగా బాత్రూం కలిగిన ప్రజలు రాజధాని ప్రాంతంలో ఎవరూ లేరని అక్కడ ఉన్న అందరికీ బిల్డింగ్ లు, డూప్లెక్స్ హౌస్ లు ఉన్నాయని...కావాలని టీడీపీ వాళ్లు చేస్తున్నారో….లేకపోతే రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు బయట పెయిడ్ ఆర్టిస్ట్ లతో చేస్తున్నారో తెలీదు కానీ ఇది చాలా పెద్ద తప్పు అంటూ హోం శాఖ మంత్రి సుచరిత కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: