అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు ఆయన సెక్యూరిటీ గురించి ఆయన వాడే కారు గురించి మొన్నటి వరకు వార్తలు రాగా. తాజాగా డోనాల్డ్ ట్రంప్ ఇంత బిల్డప్ రాక వెనుక అసలు సీక్రెట్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాక కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు అనేక విమర్శలకు తావిస్తోంది. ట్రంపు వస్తే దేశం యొక్క రూపురేఖలు మారిపోతాయి అన్నట్టు ప్రస్తుతం ఇండియా లో వాతావరణం నెలకొంది. కేవలం కొద్ది గంటల పర్యటనల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్లు వెచ్చిస్తోంది. పేదరికం కనబడకుండా అహ్మదాబాద్ పట్టణంలో గోడలు కట్టించింది.

 

ఇదే సమయంలో కొన్ని మురికివాడలను కూడా సమూలంగా మార్చడానికి పనులు చకచకా కానిచ్చింది. మరోవైపు రాష్ట్రపతి భవనంలో ట్రంప్‌కు ఇచ్చే విందులో ఏం ఉండబోతున్నాయో… కూడా.. హైలెట్ అవుతోంది. ఇదే సమయంలో ఆయన తినే తిండి బంగారు ప్లేట్లలో తిన బోతున్నట్లు...దాని కోసం భారత ప్రభుత్వం బాగా వెచ్చించినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. తినేది, తాగేది మొత్తం.. గోల్డ్ ప్లేట్లు, గ్లాసులేనని చెబుతున్నారు. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్ నివాసముండే హోటల్ మరియు ఇంకా అనేక విషయాలలో భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఇంత బిల్డప్ డోనాల్డ్ ట్రంప్ పర్యటన వెనుక ఇవ్వడానికి గల కారణాలలో సీక్రెట్ గా వస్తున్న వార్తలు ఏంటంటే మోడీ పెట్టుబడులు భారీగా రప్పించబోతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఎన్నడూ లేని మార్కెట్ భారత్ లోనే ఉండటంతో డోనాల్డ్ ట్రంప్ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో ఇవాంకా ట్రంప్ అంతర్జాతీయ వ్యాపార సదస్సులు ఏర్పాటు చేసిన సమయంలో భారత్ లో ఉన్న మార్కెట్ ప్రపంచ దేశాలలో ఎక్కడా లేదని డోనాల్డ్ ట్రంప్ కి తెలియజేయడంతో భారీగా ట్రంప్ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గట్టిగా వార్తలు వస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: