ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో రైతులు ఇంకా ఆందోళనలు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు మూడు నెలలకు పైగానే రాజధాని ప్రాంతంలో జగన్ సర్కార్ పై ఉద్యమం జరుగుతూనే ఉంది. ఎలాగైనా రాజధాని రైతులను దగ్గరికి చేర్చుకోవాలని అత్యంత పకడ్బందీ వ్యూహం రచిస్తున్న గాని రాజధాని రైతులు ఏమాత్రం వెనుకడుగు వేయడానికి ఇష్టపడటం లేదని టాక్ వైసీపీ పార్టీలో వినబడుతుంది. మరోపక్క ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఉద్యమానికి గట్టిగానే సపోర్ట్ చేస్తుంది. అన్ని విధాలా రాజధాని రైతులకు అండగా ఉండటానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధానం కోసం తెలుగుదేశం పార్టీ అనేక రీతులుగా రాజధాని రైతుల ఉద్యమం వెనుక అండగా నిలబడుతుంది.

 

ఇదే సమయంలో జనసేన మరియు బిజెపి పార్టీ అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా రాజధాని రైతుల కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం చేస్తున్న ఉద్యమం కోసం మద్దతు తెలుపుతూనే వస్తున్నాయి. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం మీరు ఇచ్చిన భూములు చేసిన త్యాగాలు ఊరికినే వృధా కాదు అంటూ చాలామంది రాజకీయ నేతలు రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా అధికార పార్టీలో చలనం లేకుండా ఉండటం పట్ల రకరకాల వార్తలు వినబడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే రాబోయేది వేసవి కాలం కాబట్టి దీక్షలు ధర్నాలు చేస్తున్న రైతులు ఏ మాత్రం ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందన్నా ఆలోచనలో జగన్ సర్కారు ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే మరోపక్క ధర్నాలు దీక్షలు చేస్తున్న అమరావతి రైతులు ఈ విషయం తెలుసుకొని ఆందోళనలు వేసవి కాలంలో చేపట్టాల్సిన తరుణంలో రెండు గ్రూపులుగా చెయ్యాలని ఉదయం ఒక గ్రూపు సాయంత్రం మరొక గ్రూపు నిరసనలు తెలుపుతూనే ఉండాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వానికి ట్విస్ట్ ఇచ్చినట్లు ఈ నిర్ణయం ఉన్నట్లు అమరావతి ప్రాంతంలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: