దేశ రాజకీయాలలో నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. 2014 దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రధాని అవటానికి డిజిటల్ మీడియా ని ఉపయోగించుకొని ప్రశాంతి కిషోర్ టీం వర్క్ చేసి మోడీ గవర్నమెంట్ రావడం కోసం తీవ్రంగా కష్టపడటం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో అనేక ఎన్నికలలో వివిధ పార్టీల ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేసి మంచి సక్సెస్ అందుకోవటం జరిగింది. మామూలుగా బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్... నితీష్ కుమార్ జెడియు పార్టీలో కీలక నాయకుడిగా మొన్నటి వరకు రాణించడం జరిగింది. అయితే ఇటీవల ఢిల్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కి రాజకీయ సలహాలు ఇవ్వటంతో బిజెపి మరియు జెడియు మిత్ర బంధానికి విరుద్ధంగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారని పార్టీ నుండి  నితీష్ కుమార్ సస్పెండ్ చేయడం జరిగింది.

 

దీంతో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పార్టీలను ఏకం చేసి కొత్త కూటమి ఏర్పాటు చేయడం కోసం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో జగన్ పార్టీకి ‘వ్యూహకర్త’గా ప్రశాంత్‌ కిషోర్‌ తన సేవల్ని అందించిన విషయం విదితమే. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో జగన్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడంతో ప్రశాంత్ కిషోర్ మరియు జగన్ మధ్య మంచి బంధం ఏర్పడింది.

 

ఈ బంధం మూలంగానే ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీం లో కీలక సభ్యుడు పెళ్లికి నార్త్ ఇండియా జగన్ తన భార్య భారతితో కలిసి వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్తగా ఇప్పటివరకు రాణించిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం వార్త నిన్న జగన్ కి ఈ వార్త అసలు నచ్చలేదట. మరోపక్క మాత్రం ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు ఇదే అసలుసిసలైన టైం అని ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: