పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అని పూర్వం ఒక కవి ఎందుకు అన్నాడో తెలియదు కానీ ఆయనను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో... చిన్న పెద్ద తేడా లేకుండా సిగరెట్, బీడీ, చుట్ట అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ తెగ పొగ పీలుస్తుంటారు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, సినిమా థియేటర్లలో, హోర్డింగుల్లో ఆఖరికి కాల్చే సిగిరెట్ పెట్టెల పైన ముద్రించినా కూడా ఒక్కరూ పట్టించుకోవడం లేదు. అందుకే ధూమపానాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది.

 

ఇప్పటికే ధూమపానాన్ని అరికట్టేందుకు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ పలు చర్యలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఎటువంటి మార్పు రాకపోవడంతో కొన్ని కఠినమైన నిబంధనలను విధించబోతోంది. ముఖ్యంగా కాలేజీ యువతను దృష్టిలో పెట్టుకొని కేంద్రం అడుగులు వేసినట్లు స్పష్టం గా కనబడుతోంది. చిన్న వయసులోనే ఎంతో మంది యువకులు స్మోకింగ్ బారినపడుతున్నారు. పొగ తాగడం ఒక ఫ్యాషన్ గా భావించి అలవాటు చేసుకున్న వీరంతా చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్ వంటి జబ్బులను కొని మరీ తెచ్చుకుంటున్నారు.

 

అందుకే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు చట్టంలోని నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. త్వరలోనే న్యాయ నిపుణుల బృందం సూచనల మేరకు క్రింది ఉన్న రూల్స్ ను ఆచరణలోకి వస్తాయని సమాచారం.

 

1. స్మోకింగ్ చేయడానికి వయోపరిమితి మార్పు

2. ప్రస్తుతం ఉన్న 18 సంవత్సరాల వయస్సును 21 ఏళ్లకు పెంచాలని సిఫార్సు

3. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు పెంపు

4. పోగాకు సంబంధించిన ఉత్పత్తులను అక్రమంగా అమ్మినవారిని గుర్తించడానికి కొత్తగా ట్రాకింగ్ విధానం

5. బహిరంగంగా స్మోక్ చేయడం నిషేధం. దొరికితే రెండు సార్లు భారీ జరిమానామితి మీరితే ఏకంగా జైలు శిక్ష పై కూడా యోచన

మరింత సమాచారం తెలుసుకోండి: