కొద్ది సంవత్సరాల ముందు దక్షిణ భారతదేశం పోలీసు యంత్రాంగానికి మరియు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు కునుకు లేని ఎన్నో రాత్రులను మిగిల్చిన ఎర్రచందనం స్మగ్లింగ్ కింగ్ వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. అతని జీవిత చరిత్ర గురించి మరియు అతని యొక్క సామర్థ్యం గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి ఇంకా అతని పై సినిమాలు కూడా తీశారు. పెద్ద పెద్ద మీసాలు వేసుకొని బక్కపలచని శరీరంతో పదునైన చూపుతో పోలీసు వారిని మించిపోయే ఆధునిక మారణాయుధాలతో అడవిని తన రాజ్యంగా మార్చుకొని స్మగ్లింగ్ కొనసాగించిన వీరప్పన్ అప్పట్లో చేసిన హవా అంతా ఇంతా కాదు.

 

అయితే ఎన్నో ఏళ్ల నిరీక్షణ మరియు పోరాటానికి ఫలితంగా చివరికి వీరప్పన్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో అంతమొందించగా అక్కడితో అక్కడితో అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అంతా అనుకున్నారు. అయితే తమిళనాట కొన్ని ప్రాంతాల్లో వీరప్పన్ పైన సానుకూల అభిప్రాయం ఉంది. కాగా గతంలో ప్రజల్లో అతనికి ఉన్న సానుకూలతను ఉపయోగించుకుందామని 2006లో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి రాజకీయాల్లోకి వచ్చింది. అయితే తమిళనాడు అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలైన ఆమె తర్వాత ఇప్పుడు ఆమె కుమార్తె రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం మరోసారి విపరీతమైన చర్చకు దారి తీసింది.

 

తాజాగా వీరప్పన్ కుమార్తె విద్యా రాణి బిజెపి లో చేరింది. క్రిష్ణగిరి లో జరిగిన బిజెపి పార్టీ కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణ సమక్షంలో శనివారం వీరప్పన్ కుమార్తె విద్యా రాణి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అతని తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉన్న విద్యా రాణి బిజెపి పార్టీ తరపున తమిళనాడులో అతని హవాను తనదైన శైలిలో కొనసాగించబోతోంది అన్నమాట.

 

అయితే ఎంతో తీవ్రమైన చర్చకు దారితీసే విధంగా పార్టీలో చేరుతున్న సందర్భంగా విద్యా రాణి మాట్లాడుతూ ఆమెతో పాటు దాదాపు వెయ్యి మంది ఆమె అనుచరులు బిజెపిలో చేరినట్లు స్పష్టం చేసింది. ఆమె అయితే సరే కానీ ఆమె అనుచరులను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారో అని ఇప్పుడు ఎంతో మంది అదే పనిగా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తన తండ్రి లాగా తన తెలివితేటలు చెడు కోసం కాకుండా ప్రజాసేవ కోసం వాడుతున్న విద్యరాణి వీరప్పన్ హవాను ఈసారి మంచి పథం వైపు కొనసాగిస్తుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: