అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే చాలా మందికి తెలిసే విషయం ఆయన నోటి దూల గురించే. తరచూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు అలవాటు. అయితే ట్రంప్ లో చాలా కోణాలు ఉన్నాయి. వాటిలో శృంగారం ఒక యాంగిల్. సక్సస్ ఫుల్ వ్యాపారవేత్త అయిన డోనాల్డ్ ట్రంప్‌ మంచి రసికశిఖామణి అని కూడా చెబుతారు.

 

ట్రంప్ కు అనేక మందితో లైంగిక సంబంధాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు కాకముందు ట్రంప్ కాసినోలకు వెళ్లి జూదమాడేవాడు. రెజ్లింగ్ పోటీల్లో పందేలు కూడా కాసేవాడు. రియాలిటీ టీవీ షో ద్వారా చాలామంది లేడీ ఫ్యాన్స్ ఏర్పడ్డారట ట్రంప్‌కు. ట్రంప్ తో మాకు అక్రమ సంబంధం ఉంది అని ఇప్పటికే చాలా మంది మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు కూడా.

 

ఒకావిడ అయితే తనను ట్రంప్ అత్యాచారం చేశాడంటూ కోర్టుకు కూడా వెళ్లింది. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇలా ఓ అమెరికా అధ్యక్షుడిపై అత్యాచారం యత్నం జరిగిందన్న కేసు చాలా అరుదు. అయితే ట్రంప్ మాత్రం ఇదంతా పబ్లిసిటీ కోసం కొందరు చేస్తున్న ప్రయత్నం అంటుంటాడు.

 

ఇక ట్రంప్ వ్యాపారిగా సక్సస్ అయ్యాక.. 1987లో రిపబ్లికన్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. కానీ పెద్దగా యాక్టివ్ గా ఉండేవాడు కాదు. ఆ తర్వాత 2000లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. తర్వాత పార్టీ ఫిరాయించారు. డెమోక్రటిక్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2009లో రిపబ్లికన్‌ పార్టీలోకి వచ్చారు. చివరకు 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై గెలుపొంది తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: