ఎలాంటి వేడియింపులు లేకుండా ఎంతో ఆనందంగా పెరిగిన ఒక్క మహిళను అయినా చూపించగలరా? చూపించలేరు.. ప్ర్రతి మహిళకు ఒకానొక సమయంలో కష్టాలు వస్తాయి.. ఆ కష్టాలను దాటుకొని వచ్చిన మహిళలే అమ్మలు అవుతారు.. ఇండిపెండెంట్ మహిళలు అవుతారు.. అలాంటి మహిళలు ఇప్పుడు 16.. 17 వయసులోనే ఆత్మహత్య చేసుకుంటున్నారు.. బతకాలని ఉందమ్మా కానీ బతకనియ్యడం లేదు అని లేక రాసి మరణిస్తున్నారు.. ఆత్మహత్య ఎంత భయంకరమైనదో తెలుసా? 

 

అవును నిజంగానే.. బయటకు చెప్తే పరువు పోతుంది అని.. ఇంట్లో తల్లితండ్రులకు కూడా చెప్పకుండా ఈ కాలం ఆడపిల్లలు 16.. 17 ఏళ్లకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. దీనికి కారణం సెల్ ఫోనే.. పదో తరగతి అవ్వగానే తల్లి తండ్రులు పిల్లలకు సెల్ ఇస్తారు.. ఎంత జాగ్రత్తగా ఉన్న ఎవడో ఒక నీచ నికృష్టుడు నెంబర్ తెలుసుకొని మెసెజ్ చేస్తాడు.. 

 

మొదటి వాడిని రెండో వాడిని మూడో వాడిని బ్లాక్ చేస్తారు. కానీ ఆలా అని ఎలా అంటే ఆలా మెసెజ్ లు వస్తే ఏదో ఒక నెంబర్ కు రెస్పాండ్ అవుతారు.. వాడే కాలయముడుగా మారుతాడు.. మొదట హయ్ అని.. రెండు రోజు నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అని.. మూడో రోజు నీ అంత అందమైన అమ్మాయి మరొకరు లేరు అని.. నాలుగో రోజు ఐ లవ్ యు అని.. ఐదొవ రోజు మితి మీరిన చాటింగ్.. ఆరొవ రోజు బ్లాక్ మెయిల్.. ఎడొవరోజు బాలిక ఏడుపు.. 8వ రోజు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలని ప్రయత్నాలు.. తొమ్మిదొవ రోజు చెప్పలేక మానసిక వేదన.. 10వ రోజు బాలిక ఆత్మహత్య. 

 

తల్లికి తండ్రికి రాసిన లేఖలో మాత్రం.. నన్ను వాడు బతకనివ్వడం లేదమ్మా.. బతకాలని ఉందమ్మా అని బతికి ఉన్న తల్లిని పిచ్చి దాన్ని చేసే రాతలు రాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేటితరం బాలికలు. ఇలా చెయ్యడం ఎంత వరుకు న్యాయం.. వచ్చాయి అండి షీ టీంలు.. కానీ జరిగే న్యాయం ఎప్పుడో.. ఇక్కడ వీడు మాత్రం రూమ్ కు రాకపోతే చంపేస్తా.. యాసిడ్ పోస్తా.. నీ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి అల్లరి చేస్తా అంటూ బెదిరింపులు.. 

 

ఇంట్లో తల్లితండ్రులు ఎంత స్నేహితుల్లా ఉన్న ఇలాంటివి చెప్పలేని పరిస్థితి.. ఆలా చెయ్యకండి అమ్మ.. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసిన నువ్వు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది అంటే ఖచ్చితంగా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పు.. నువ్ ఎంత తప్పు చేసిన సరే నీ బాధను అర్థం చేసుకొని సమస్య నుండి బయటకు పడేస్తారు.. అవును.. నువ్వు చేసిన తప్పు వింటే నిన్ను ఒకసారి తిట్టచ్చు.. కొట్టచ్చు.. కానీ నీ ప్రాణం అయితే తియ్యరు కదా.. నీ ప్రాణం నువ్వు తీసుకునే దానికంటే వాళ్ళు తిట్టినా తిట్లు పెద్దవి కాదు కదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: