మనం చేయాలి అనుకునే పనులు ఏవైనా రెండు సార్లు జరుగుతాయి. మొదట ఒక ఆలోచన మన మనసులోకి వస్తుంది. అయితే ఆ ఆలోచన ఎంత సమర్థవంతంగా బాహ్య ప్రపంచంలో మనం దానిని బయట పెట్టుకోగాలుగుతామో ఆ విషయం పైనే మన ఆలోచన విజయంతో పాటు ధన సంపద ముడిపడి ఉంటుంది.


దీనితో ధనవంతులు కావాలి అని కలలు కనేవారు అంతా మన మనసులోని ఆలోచనకు బాహ్య ప్రపంచానికి వారధిగా మారగాలగాలి. ముందుగా మనసులో వచ్చిన ఆలోచన సృష్టి అయితే ఆ ఆలోచనను సంపదగా మార్చుకోగలగడమే సంపద సృష్టి. ఒక వ్యక్తి సంపన్న భావాలతో ధనవంతుడుగా మారాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి. ముందుగా ప్రతి వ్యక్తి ధనవంతుడు అవ్వాలని ఖచ్చితంగా నిశ్చయించుకోవాలి. అదేవిధంగా పెద్ద మొత్తాల సంపాదన గురించి ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలి.


ఈప్రయత్నాలలో మనకు వచ్చే డబ్బును నిలుపుకుని కాపాడుకోవాలి. అయితే ఈడబ్బు సంపాదనలో వచ్చే అనేక సమస్యలను ఎదుర్కునే మానసిక ధైర్యం సమయస్పూర్తి ఉండాలి. ఈ లక్షణాలతో పాటు ఆర్ధిక నిర్వాహణ పొదుపు ఆర్ధిక విజ్ఞానం వ్యాపార పరిజ్ఞానం పెట్టుబడి వ్యూహాలతో పాటు ఒక పైప్ లైన్ లా ఆదాయం వచ్చే మార్గాలు ఏర్పరుచుకుని ఎప్పుడు ఒకే మార్గం పై ఆదారపడకూడదు.


ఇలా డబ్బుకు సంబంధించిన అంతర సూత్రాలతో పాటు బాహ్య సూత్రాలు కూడ తెలుసుకుని బాహ్య సూత్రాలు బాగా అమలు చేయగలిగిన వ్యక్తికి మాత్రమే సంపద దరి చేరుతుంది. అయితే ఈ విషయాలు చదవడానికి బాగానే ఉన్నా ఆచరించే విషయంలో మాత్రం చాల తెలివితేటాలు ఉండాలి. మనం జీవితంలో ఏది ముఖ్యం అని భావిస్తామో మన మనసు వాటిని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు ధనవంతులు అవుతామో తెలియకపోయినా మనం మాత్రం సంపన్న భావంతో ఉన్నప్పుడు మాత్రమే ఐశ్వర్య వంతులు కాగలరు అని మనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: