ఆ మద్య హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో కోటా శ్రీనివాస రావు పాడే పాటు గుర్తుందా.. మందు బాబులం మేము మందుబాబులం.. మందు వేస్తే మాకు మేమె మహారాజులం.. అంటూ మందు వేసిన ప్రతి వాడు నిజంగానే తనకు తాను మహారాజుగా ఫీల్ అవుతుంటారు.  మనసులో ఉన్న నిజాలన్నీ కక్కేస్తుంటారు.. ఆ సమయంలో ఎవరూ చేయని సాహసాలు కూడా చేస్తుంటారు.  ఇటీవల కొంత మంది మద్యం సేవించి కరెంటు స్థంబాలు ఎక్కిన ఘటనలు వెలుగు లోకి వచ్చాయి.  తాజాగా ఇలాంటి పరిస్థితే  సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. 

 

ఫుల్లుగా మందు తాగి, మత్తులో  కరెంటు స్తంభం ఎక్కాడో వ్యక్తి. దిగిరావాలని ఎంత మొత్తుకున్నా వినకపోగా ఇంకో బాటిల్ ఇవ్వకపోతే కిందకు దూకి చస్తానంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు. స్థానికులు ఎంతగా నచ్చజెప్పినా అతడు వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం చూపించడంతో అతడు కిందికి దిగేందుకు అంగీకరించాడు. దీంతో వీధిలైట్లు బిగించేందుకు ఉపయోగించే క్రేన్ సాయంతో పోలీసులు అతడిని కిందికి దించారు. 

 

వరంగల్ జిల్లా పాలకుర్తి కొడకండ్లకు చెందిన ఇజాజ్ అహ్మద్ ( 35 ) భార్యాపిల్లలతో కలిసి బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి బేగంపేట శ్యామ్​లాల్ బిల్డింగ్ ప్రాంతంలో కేబుల్​ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా మందుకు బానిసై అప్పుల పాలయ్యాడు. తాగివచ్చి భార్యతో గొడవ పడటంతో పిల్లలను తీసుకుని ఆమె కొడకండ్లకు వెళ్లిపోయింది. ఈ మద్య ఆనయ కుమారుడికి కూడా కాలు ప్రమాదం జరిగినట్లు సమాచారం.  అప్పటి నుంచి మానసికంగా ఆయన ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు అంటున్నారు. అధికంగా తాగుతూ ఇలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం నిజంగా బాధాకరం అని స్థానికులు అంటున్నారు.   తాజాగా దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: