ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ గత ప్రభుత్వంలో టీడీపీ చేసిన అవినీతిని బట్టబయలు చేస్తోంది. 2014 నుండి 2019 వరకు ఎన్నో సెక్టార్ లలో జరిగిన స్కాములటినన్నిటిని వెలికి తీసి మరీ వాటి వెనుక ఉన్న సూత్రధారులను బయటకు లాగేస్తుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ని ఏర్పాటు చేసి అమరావతి లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, ఇంకా ఇతర అవినీతి కార్యకలాపాలను వెలుగులోకి తెస్తోంది.



ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో రూ.975 కోట్ల ఈఎస్‌ఐ స్కామ్ బయటపడి పెద్ద దుమారం రేపింది. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ నిధులను కొంతమంది పక్కదారి పట్టించారు. అయితే ఈ స్కామ్ లో సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని వార్తలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సిపి పార్టీ టీడీపీ హయాంలో జరిగిన అన్నీ అవినీతి కార్యకలాపాలను బయటకు తీసేందుకు సమర్థవంతమైన చర్యలను తీసుకుంటుందని చెప్పవచ్చు. అయితే జనసేన నేతలు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ అవినీతిపై నిశ్శబ్దంగా ఉంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.



ఒకవేళ వైసిపి పార్టీ టిడిపిపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిజమైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు వైసీపీ పార్టీకి ప్రతిపక్షంగా జనసేన పార్టీ ఒకటే ఉంటుంది. అలా జరిగితే వైసీపీ పార్టీ తో ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనే ఆపర్చునిటీ జనసేన పార్టీకి లభిస్తోంది. వ్యతిరేక పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే అవినీతి విషయంలో వైసీపీ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తూ టిడిపి పార్టీ అవినీతిపై వ్యతిరేకంగా పోరాడితే ప్రజల్లో మంచి పేరు తో సహా లాభం చేకూరుతుందని జనసేన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ అవినీతి విషయం పై పవన్ కళ్యాణ్ ఎలా నడుచుకుంటారో చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: