ట్రంప్ భార్య మెల‌నియో గురించి చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఆమె ఓ గ్లామర్‌ మోడల్‌. ట్రంప్‌ తొలిసారి 1998లో మెలనియాను న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో చూశాడు. అప్పటికి ఆమె వయసు 28 ఏళ్లు. అతడి వయసు 52 ఏళ్లు. ఇద్దరికీ ఇరవై నాలుగేళ్లు తేడా. అప్ప‌టికే రెండో భార్య నుంచి ట్రంప్ వేరుగా ఉంటున్నారు. చివ‌ర‌కు ఎట్ట‌కేల‌కు మెల‌నియా ట్రంప్ ప్రేమ‌లో ప‌డింది. పెళ్లి చేసుకుంది.



ఇక భారత ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న ట్రంప్ త‌న భార్య మెల‌నియాతో పాటు కుమార్తె ఇవాంకా ట్రంప్‌, అల్లుడితో కూడా వ‌స్తుండ‌డం విశేషం. ఇక భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తోన్న ట్రంప్ ఫ్యామిలీకి మ‌న ప్ర‌భుత్వం నుంచి ఎన్నో అరుదైన గిఫ్ట్‌లు ఇవ్వ‌నున్నారు. ఇక మెల‌నియాకు ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన చీర గిఫ్ట్‌గా ఇవ్వ‌నున్నారు. ఈ చీర స్పెషాలిటీస్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే.



మెల‌నియాకు గిఫ్ట్ ఇచ్చే చీర పేరు ప‌టోనా చీర‌. ఇది గుజ‌రాత్‌లో ప్ర‌త్యేకంగా త‌యారు కావ‌డానికి ఎలాంటి ఇండ‌స్ట్రీ లేదు. ఇది స్వ‌చ్ఛ‌మైన ఇండియ‌న్ బ్రాండ్‌. ప‌టోనాలోని సాల్వో కుటుంబం మాత్ర‌మే ఈ చీర‌లు త‌యారు చేస్తుంది. ఇందుకోసం చెట్ల నుంచి తీసిన ఒరిజిన‌ల్ క‌ల‌ర్స్ మాత్ర‌మే మిక్స్ చేసి వాడ‌తారు. ఈ చీర‌ల త‌యారీలో సాల్వో కుటుంబానికి 30 త‌రాలు అంటే 900 ఏళ్ల నుంచి అనుభ‌వం ఉంది.



ఈ చీర‌ల త‌యారీకి ఎలాంటి ఇండస్ట్రీ లేక‌పోయినా ఆ కుటుంబం మాత్ర‌మే ఈ చీర‌లు త‌యారు చేయ‌డంలో ప్ర‌త్యేక‌త కలిగి ఉంది. చెట్ల బెర‌ళ్ల నుంచి తీసిన రంగులు త‌యారు చేసి అత్యంత స‌హ‌జ‌సిద్ధంగా ఈ చీర‌కు అద్దుతారు. న‌లుగురు వ్య‌క్తులు ఆరు నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డితే ఒక చీర త‌యారు అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఎన్ని సార్లు ఉతికినా.. ఎన్ని సంవ‌త్స‌రాలు ఉన్నా ఈ చీర రంగులు వెల‌వ‌డం జ‌ర‌గ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: