భారత్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ఎంతో ఆసక్తిని సంతరించుకొంది. మొదటిసారి డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇక మరో గంటలో డోనాల్డ్ ట్రంప్ కుటుంబంతో గుజరాత్లోని అహ్మదాబాద్లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ పర్యటించిన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇక డోనాల్డ్ ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  పర్యటన కోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా అహ్మదాబాద్ కు చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... నమస్తే ట్రంప్  కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

 

 

 అయితే ట్రంప్ ఇండియా పర్యటన నేపథ్యంలో అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు,  భారత్ కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది,  స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఇక వీరితో పాటు దాదాపు పది వేల మంది పోలీసులు గుజరాత్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రంపు కోసం ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది లో అత్యంత శక్తివంతమైన భద్రతా సిబ్బంది సీక్రెట్ ఏజెంన్సీ. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భద్రత విషయంలో సీక్రెట్ ఏజెన్సీ పాత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన కుటుంబ రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే . అయితే అమెరికా దేశ ప్రథమ పౌరుడు కి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ  పర్యవేక్షిస్తుంది.

 

 

 అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటం తో పాటు.... అనుకోని ప్రమాదం ఎదురైతే తప్పించుకునే మార్గాలు ప్రణాళికలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుతుంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ. ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే... అవసరమైన రక్తాన్ని కూడా అందుబాటులో ఉంచుతోంది. ఇక అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ రక్షణ కల్పిస్తూ ఉంటుంది. డోనాల్డ్ ట్రంప్ విశ్రాంతి తీసుకునే గది వరకు కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అనుసరిస్తూనే ఉంటుంది. చట్ట ప్రకారం తను ఒంటరిగా వదిలేయాలని అంటూ డోనాల్డ్ ట్రంప్ కూడా ఏ అధికారిని ఆదేశించ లేడు. 1865లో ఏర్పాటైన ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తుంది. సుమారు ఏడువేల మందితో కూడిన ఈ విభాగంలో 25 శాతం మంది మహిళలే ఉంటారు. ప్రపంచంలో ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ ఇస్తూ ఉంటారు ఈ సైన్యంలోని సభ్యులకు.

మరింత సమాచారం తెలుసుకోండి: