గత తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో లెక్కకు మిక్కిలిగా చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఆఘమేఘాల మీద సిట్ ను  ఏర్పాటు చేసింది. అవినీతికి సంబంధించి అనేక  కీలక ఆధారాలు దొరకడంతో  టిడిపి నాయకులు, అప్పటి ప్రభుత్వ పెద్దల అవినీతి సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కేంద్రం, ఏపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఉన్న పెద్ద తలకాయలనే టార్గెట్ చేసుకోవడంతో ఈ సిట్ఏ ఏర్పాటయింది. ఇప్పటికే సిట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. 


కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల  శ్రీనివాస్ అవినీతి కి సంబంధించిన అనేక ఆధారాలు దొరకడం, అందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ వంటి నాయకుల పాత్రను ఐటీ శాఖ సాక్షాలతో సహా పట్టుకోవడం జరిగాయి. రెండు రోజుల క్రితం  ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఒక రకమైన భయాందోళనలు మొదలయ్యాయి. 


ఇదిలా ఉండగా ఇప్పుడు అధికారుల్లోనూ భయం ఎక్కువ గా కనిపిస్తోంది. టిడిపి ప్రభుత్వంలో రాజకీయ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టుగా ఆధారాలు దొరుకుతుండడంతో  అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు సిట్ కనుక అవినీతి ఆధారాలు బయట పెడితే అందులో సంతకాలు పెట్టిన తమ వ్యవహారం కూడా బయటకు వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. నాయకులు చెప్పినట్టలా చేసి నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఆయా వ్యవహారాలకు సంబందించిన ఫైళ్ల పై సంతకాలు పెట్టిన తామంతా ఇప్పుడు ఇరుక్కోవడం ఖాయం అనే ఆందోళనలో అధికారులు ఉన్నట్టు తెస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: