అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా ప్రజలు, ప్రముఖులు, అభిమానులు మొతెరా స్టేడియానికి చేరుకున్నారు. దేశం మొత్తం ట్రంప్ కు ఘన స్వాగతం పలకడానికి ఎదురు చూస్తోంది. ఇప్పటికే ట్రంప్ భారత్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. నెటిజన్లు ట్రంప్ పర్యటన నేపథ్యంలో ట్రంప్ కు సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 
 
ఆగ్రా, అహ్మదాబాద్ పర్యటనల అనంతరం ట్రంప్ దంపతులు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్ లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ లో బస చేయనున్నారు. ఈ సూట్ లో స్టే చేయాలంటే ఒక రాత్రికి 8 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక రాత్రికి 8 లక్షల రూపాయలా..? అని షాక్ అవుతున్నారా...! ట్రంప్ పర్యటన అంటే కేంద్రం ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్ కోసం గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ ను బుక్ చేసింది. 
 
ఈ గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గ్రాండ్ ప్రెసిడెన్షియల్ హోటల్ లో గతంలో ఇండియాకు వచ్చిన అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ బస చేశారు. ఈ సూట్ లో 55 అంగుళాల అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హై డెఫినిషన్ టీవీ, స్వచ్చమైన గాలిని అందించే ఫిల్టర్లు, ఆహారాన్ని పరీక్షించటం కోసం మైక్రో బయోలాజికల్ లాబొరేటరీ, ఐపాడ్ డాకింగ్ స్టేషన్ ఉన్నాయి. 
 
ఈ గ్రాండ్ ప్రెసిడెన్సియల్ సూట్ లో మినీ స్పా, పర్సనల్ జిమ్, విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన రెస్ట్ రూం, ప్రత్యేకమైన లివింగ్ రూం, సౌకర్యవంతమైన డైనింగ్ రూం, వుడెన్ ఫ్లోరింగ్, సిల్క్ ప్యానెల్డ్ గోడలు, అదిరిపోయే కళాకృతులు, ఉన్నాయి. మరికొన్ని నిమిషాల్లో ట్రంప్ అహ్మదాబాద్ కు చేరుకోనున్నారు. పర్యటన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రా సందర్శనకు ట్రంప్ వెళతారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: