అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పాటు భారత పర్యటన ఎంతో ఆసక్తిని సంతరించుకున్న విషయం తెలిసిందే. మొదటిసారి అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి డోనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తుండటంతో  ఈ ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. అయితే 24 25 తేదీల్లో డోనాల్డ్ ట్రంప్  భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇక డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్లో అడుగు పెట్టారు. ఇక డోనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వందల కోట్లు ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. ఇక డోనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో అడుగడుగునా భారీ మొత్తంలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అక్కడి నుంచి 23 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి మొతేరా స్టేడియానికి చేరుకోనున్నారు. 

 

 

 మొతేరా  స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పర్యటన నేపథ్యంలో భారీ మొత్తంలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ట్రంపు స్వాగతం పలికేందుకు ఎంతోమంది మహిళలు పురుషులు సిద్ధమయ్యారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనలో భాగంగా రోడ్ షో కోసం భారతీయులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మోతేరా క్రికెట్ స్టేడియం కి ఇరవై రెండు కిలోమీటర్ల మేర నగరాన్ని మొత్తం ఎంతో సుందరంగా మోదీ సర్కార్ కి చెందిన విషయం తెలిసిందే . నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే భారీ మొత్తంలో ప్రజలు తరలివస్తున్నారు. 

 

 

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారత జెండాలతో పాటు అమెరికా జెండాలతో కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు ప్రజలు. ఇప్పటికే ట్రంప్  కి స్వాగతం పలికేందుకు సిద్ధమైన ప్రజలు భారీ మొత్తంలో రోడ్ షో కి చేరుకున్న ఈ సందర్భంగా చాలా మంది చేతుల్లో అమెరికా జెండాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే వివిధ వేషధారణలో కూడా ట్రంప్ కి  స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇక ట్రంక్ రోడ్ షో సందర్భంగా ప్రత్యేక నృత్యాలు చేసేందుకు కూడా కళాకారులు విద్యార్థులు సిద్ధమయ్యారు. ఎంతో మంది ప్రజలతో పాటు విద్యార్థులు కూడా ట్రంప్ కు స్వాగతం పలికేందుకు వేచి చూస్తున్నారు. అంతేకాకుండా కాశ్మీరి అమ్మాయిలు కూడా ట్రంప్ కి  స్వాగతం పలుకుతూ నృత్యాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: