అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం భారత్ కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ట్రంప్ భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు భారత్ కు ఇవాంకా, ట్రంప్ సతీమణి మెలానియా చేరుకున్నారు. ట్రంప్ కు గుజరాత్ సీఎం విజయ్ రూపానీని ఇతర అధికారులను మోదీ పరిచయం చేశారు.
 
యూపీ గవర్నర్ అనందబీన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రంప్ కు ఘన స్వాగతం పలికారు. గుజరాత్ సాంప్రదాయానికి చెందిన కళాకారులు వస్త్రధారణతో, సంప్రదాయ వాయిద్యాలతో ట్రంప్ కు స్వాగతం పలికారు. పలువురు కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విమానశ్రయం నుండి ట్రంప్ తన బీస్ట్ వాహనంలో సబర్మతికి పయనమయ్యారు. 
 
ట్రంప్ భార్య మెలానియా ఈ పర్యటనలో ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ మూడవ భార్య అయిన మెలానియా తనకూ ట్రంప్ కు 24 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ ట్రంప్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 12.15 గంటలకు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న ట్రంప్ ఆ తరువాత 22కిలోమీటర్ల రోడ్ షో ర్యాలీలో పాల్గొననున్నారు. అధికారులు ట్రంప్ కు ఘన స్వాగతం పలకడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
నమస్తే ట్రంప్ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. ట్రంప్ ఈ కార్యక్రమంలో భారత ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం తరువాత ట్రంప్ 3.30 గంటలకు ఆగ్రాకు బయలుదేరుతారు. ఆ తరువాత తాజ్ మహల్ ను సందర్శించి రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేయనున్నారు. రేపు రాత్రి 10 గంటలకు ట్రంప్ తిరుగు ప్రయాణం కానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: