ఇండియాలో కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అద్భుత రీతిలో స్వాగతం లభించింది. రోజు వాడే వాహనాన్ని పక్కకుపెట్టి రేంజ్ రోవర్ కారులో రన్ వై పైకి వచ్చారు. ముందుగానే ఇవాంక ట్రంప్‌ను కలిసి డొనాల్డ్ ట్రంప్.. మెలానియా ట్రంప్ కోసం ఎదురుచూశారు. ట్రంప్ కు హగ్ ఇచ్చి వెల్ కమ్ చెప్పి కరచాలనాలతో మిగిలిన వారికి స్వాగతం పలికారు.   కూతురు ఇవాంక ట్రంప్.. అల్లుడు జారేద్ కుష్నర్‌తో సహా భారత్‌లో విహరించేందుకు అడుగుపెట్టారు. ప్రముఖులంతా.. వీరికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు అందజేశారు. ట్రంప్ రాకతో గుజరాత్‌లో పండుగకు మించిన వాతావరణాన్ని సృష్టించారు. ఇక్కడి నుంచి నేరుగా స్టేడియంకు చేరుకోనున్నారు.   

 

ఎయిర్ ఫోర్స్ వన్ విమానం నుంచి దిగిన ట్రంప్ కు, తొలుత స్వాగతం పలికి నరేంద్ర మోదీ, కరచాలనం, ఆలింగనాలతో ఆహ్వానం పలికారు.  ఇక  భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ సాగిన ఆహ్వాన కార్యక్రమం ట్రంప్ ను అబ్బరపరిచింది. డప్పు వాయిద్యాలు వాయిస్తూ..శంఖాలు ఊదుతూ...సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో పలువురు ట్రంప్ కు స్వాగతం పలుకుతూ ఉంటే, వారందరినీ ఆశ్చర్యపూర్వకంగా చూస్తూ ట్రంప్ ముందుకు సాగారు.  తాను భారత భూమిపై అడుగు పెట్టిన వెంటనే తనకు దక్కిన గౌరవానికి అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఉబ్బి తబ్బిబ్బైపోయారు. 

 

ఆపై యూఎస్ నుంచి వార్ షిప్ లో తెచ్చిన బీస్ట్ వాహనంలో మొతేరా స్టేడియంకు ఆయన పయనం అయ్యారు.  భారీ కాన్వాయ్ తో ట్రంప్ సబర్మతి ఆశ్రమానికి వెళ్తున్నారు. మోతెరా స్టేడియం లో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనుంది. రోడ్డు పొడవునా భారీ ఎత్తున ప్రజలు ట్రంప్ కి స్వాగతం పలికారు. అక్కడ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఆగ్రా వెళ్తారు. తాజ్ మహల్ పర్యటన తర్వాత ఢిల్లీకు చేరుకుని మౌర్య హోటల్ లో బస చేస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: