అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం భారత్ లో అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ విమానం నుండి దిగిన ట్రంప్ కు ఘన స్వాగతం పలికారు. విమానశ్రయం నుండి ట్రంప్ తన బీస్ట్ వాహనంలో బయలుదేరి సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ట్రంప్ కు అధికారులు, ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. అమెరికా - భారత్ జెండాలతో సబర్మతి ఆలయానికి వెళ్లే దారిలో ట్రంప్ కు ఘన స్వాగతం పలికారు. 
 
ట్రంప్ కంటే ముందే మోదీ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. మోదీ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్ కు శాలువా కప్పి మరోసారి స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోడ్ షో ప్రారంభమైంది. తెల్లని రంగులో ఉన్న ఇన్నోవా వాహనాలు ట్రంప్ వాహనానికి ముందు నడుస్తుండగా ఆ వాహనాలను నల్లటి రంగులో ఉన్న ట్రంప్ కాన్వాయ్ అనుసరిస్తోంది. 
 
ప్రజలు రహదారులకు ఇరువైపులా నమస్తే ట్రంప్ అని నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. రోడ్లకిరువైపులా ట్రంప్, మోదీ కటౌట్లు ఆకర్షిస్తున్నాయి. 22 కిలోమీటర్లు ఈ రోడ్ షో సాగనుంది. సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్ గాంధీ చిత్రానికి పూలమాల వేసి చరఖాను తిప్పారు. ఆ తరువాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసి సంతకం చేశారు. 
 
డొనాల్డ్ ట్రంప్ ను చూడటానికి మొతెరా స్టేడియానికి ఇసుకేస్తే రాలనంత మంది జనం హాజరయ్యారు. లక్ష నుండి 2 లక్షల లోపు జనం మొతెరా స్టేడియానికి హాజరయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. తండ్రితో పాటు మొతెరా స్టేడియంలో జరగనున్న నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఇవాంకా పాల్గొంటున్నారు. భారత పర్యటనలో ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: