అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దంప‌తులు భార‌త్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. నేరుగా అహ్మ‌దాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్ దంప‌తుల‌కు అనేక సాంస్కృతిక కార్య‌క్ర‌మాల న‌డుమ భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అక్కడ నుంచి ట్రంప్ దంప‌తులు నేరుగా గాంధీజీ 12 సంవ‌త్స‌రాల పాటు ఉన్న స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మానికి చేరుకున్నారు. అక్క‌డ రాట్నం గాంధీజీ ఎలా వ‌డికేవారో మీడియేట‌ర్ గా ఉన్న ఓ అమ్మాయి చెప్ప‌గా ట్రంప్ సావ‌ధానంగా విన్నారు.



ఆ త‌ర్వాత ట్రంప్ దంప‌తులు ఇద్ద‌రూ స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మంలో ఉన్న సంద‌ర్శ‌కుల పుస్త‌కంలో సంత‌కాలు చేశారు. అలాగే చ‌ర‌కా ప‌నితీరు కూడా ట్రంప్ అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ సంద‌ర్శ‌న త‌ర్వాత ట్రంప్ దంప‌తులు మొతేరా స్టేడియానికి చేరుకున్నారు. ఇక ట్రంప్ భార్య మెల‌నియా డ్రెస్ చాలా ప్ర‌త్యేకంగా అనిపించింది. అమెరికా అధ్య‌క్షుడు భార్య‌, పైగా కోటీశ్వ‌రులు... మాజీ మోడ‌ల్ కావ‌డంతో ఆమె డ్రెస్ ఎంత స్పెష‌ల్గా ఉంటుందో అన్న ఆస‌క్తి అంద‌రికి ఉంటుంది.



అయితే మెల‌నియా చాలా సింపుల్ గా డ్రెస్ కోడ్ పాటించారు. ఓ వైడ్ క‌ల‌ర్‌లో మ‌న పంజాబీ డ్రెస్ టైప్‌లో చాలా ప‌ల్చ‌గా ఉన్న డ్రెస్ మాత్ర‌మే ఆమె ధ‌రించారు. ఆమె వైట్ క‌లెర్ డ్రెస్ టాప్ మాత్రం ఫుల్ హ్యాండ్‌గా ఉంది. అయితే న‌డుముకు మాత్రం ఆమె వ‌చ్చే ట‌ప్పుడు ఓ న‌ల్ల‌టి చున్నీ లాంటి వ‌స్త్రం మాత్రం క‌ట్టుకున్నారు. ఇక స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలోకి వ‌చ్చాక అక్క‌డ ఓ ఖ‌ద్దరు కండువాను ట్రంప్‌తో పాటు ఇవాంక మెడ‌లో వేశారు.



ఆ ఆశ్ర‌మంలో ఉన్నంత సేపు..  అక్క‌డ నుంచి మెతేరాకు బ‌య‌లు దేరాక కూడా ట్రంప్ దంప‌తుల మెడ‌లో ఆ తెల్ల ఖ‌ద్ద‌రు కండువాలు ఉన్నాయి. ఏదేమైనా అమెరికా అధ్య‌క్షుడు.. ఆ దేశ తొలి మ‌హిళా హోదాలో ఉన్న ఈ మాజీ మోడ‌ల్ డ్రెస్ సింపుల్‌గా ఉండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: