పార్కు అన్న తర్వాత ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి ఫ్యామిలీతో, స్నేహితులతో, లవర్ తో ఇలా ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే సమాజంలో ఎక్కువగా పార్కులకు పెళ్లి గాని జంటలు వస్తారని, అసాంఘిక కార్యక్రమాలు పబ్లిక్ లోనే చేస్తారనే ముద్ర పడిపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని సమయాలలో కొంతమంది జంటలు పార్క్ లో అందరూ చూస్తుండగానే రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒకవేళ ఎవరైనా తమ ఫ్యామిలీతో వస్తే వారి రొమాన్స్ చూసి కొంచెం ఇబ్బందికరంగా ఫీలవుతారు. తాను కూడా తన ఫ్యామిలీతో ఓ పార్క్ కి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను అంటుంది అస్లాం ఖాన్ అనే ఒక ఐఏఎస్ అధికారిణి. కానీ నెటిజన్లు మాత్రం ఆమె తీసిన ఫోటో గురించి ఛీ కొడుతున్నారు. ఎందుకో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.




వివరాలు తెలుసుకుంటే... ఢిల్లీలోని ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి విశ్రాంతి తీసుకోవడానికి తన బిడ్డ లతో పాటు టాల్కటోరా గార్డెన్స్ పార్క్ కి వెళ్ళింది. అయితే ఆమెకి అక్కడ ఇద్దరు ప్రేమపక్షులు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కనిపించారు. దీంతో తాను వారి ఫోటోలను తన కెమెరాలో బంధించి, వాటిని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అలాగే, 'ఒకవేళ మనం పిల్లలతో వచ్చినప్పుడు, వారు ఇటువంటివి చూస్తే వాళ్లకి ఏమని చెప్పాలి?', అని ప్రశ్నించింది. 'వీళ్లిద్దరిని చూడగానే నేను ఆ పార్కు నుండి నెహ్రూ పార్క్ కి మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను', అని కూడా చెప్పుకొచ్చింది.



అయితే ఈ ఫోటోని ఎప్పుడైతే అస్లాం ఖాన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిందో, ఆ క్షణం నుండి నెటిజనులు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఆమె తీసిన ఫోటోలో ఒక యువతి తన లవర్ ఒడిలో పడుకుని ఉంది. అలాగే, ఫోటోని ఏ కోణంలో చూసినా కేవలం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తమ సమయాన్ని గడుపుతున్నారనే కనిపిస్తుంది తప్ప వారు తప్పుడు పని ఏమీ చేయడం లేదని తెలుస్తోంది.

 

 

దీంతో నెటిజన్లు ఐపీఎస్ అధికారిణి పోస్ట్ కి స్పందిస్తూ... ఆ లవర్స్ తమ సమయాన్ని జాలిగా గడపడానికి పార్క్ కి వెళ్లారు. కానీ మీరేమో వారి పరిమిషన్ లేకుండా వారి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న సినిమాలలో, టీవీ సీరియళ్లలో అన్నీ అశ్లీల సన్నివేశాలు వస్తున్నాయి. వాటిని మీ పిల్లల నుంచి దూరంగా ఉంచండి. ఇటువంటి లవర్స్ ని చూపి ఆప్యాయత అంటే ఏంటో చెప్పండి. అంతేకానీ ఇలా ప్రేమికుల పరువు తీయకండి అని చీదరించికుంటూ చివాట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇద్దరి ప్రేమికుల మధ్య జరుగుతున్న ఆనందకరమైన క్షణాలను తప్పుగా వేలెత్తి చూపించడం సరికాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: