అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్య అధ్యక్షుడు ప్రపంచదేశాలకు పెద్దన్న అయిన డోనాల్డ్ ట్రంప్  మొదటిసారి భారత పర్యటనకు  రావడంతో దేశ ప్రజలు చూపే కాదు ప్రపంచం చూపు మొత్తం ఈ పర్యటన పైన ఉంది.  అయితే తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు. కాగా ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చేసిన సాంస్కృతిక నృత్యాలు ట్రంప్ నీ  ఆకర్షించాయి. ఇక అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించేందుకు వెళ్లారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు. 

 

 ఇక ఆశ్రమం లోకి వెళ్ళే ముందు ట్రంప్  మెలానియా మోదీకి  తమ పాదరక్షలు విడిచి లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్ దంపతులకు అందించిన పూలమాలను తీసుకొని.. ట్రంప్ మోదీ గాంధీ చిత్రపటానికి అలంకరించారు. అనంతరం అక్కడ మహాత్మాగాంధీ వాడిన చరక యంత్రాన్ని తిప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక ట్రంప్ సతీమణి మెలనీయ ఆ  చరక యంత్రాన్ని తిప్పుతుంటే యంత్రాన్ని ఆసక్తిగా తిలకించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ . ఇక ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 

 

 

 అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు అగ్ర నేతగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేలా ఇక్కడ ఒక పని చేశారు. ట్రంప్ ఎప్పుడు నేలపై కూర్చున్న సందర్భాలు లేవు. ఆయనకు అంత అవసరం కూడా లేదు. కానీ సబర్మతి ఆశ్రమంలో ట్రంప్  ఆయన సతీమణి మేలనియ  కలిసి కూర్చోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్  నేలపై కూర్చోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా కలిసి సబర్మతి ఆశ్రమంలో కలిగిన అనుభూతి గురించి వివరిస్తూ పర్యాటకుల పుస్తకంలో సంతకాలు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: