తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు  ఏ రేంజ్ లో పగ ప్రతీకారాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏక వచనంతో చంద్రబాబును ఎప్పుడు ఎక్కడైనా తిట్టగల సమర్ధుడు కేసీఆర్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేయాలని కేసీఆర్ ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఆ విధంగానే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయగలిగాడు. అక్కడ చెప్పుకోవడానికి పార్టీ ఉన్నా... చెప్పుకోదగిన నాయకులూ, కార్యకర్తలు లేరు. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారంతా టిఆర్ఎస్ లోనూ, మరికొంతమంది కాంగ్రెస్ లోనూ చేరిపోయారు. దీంతో కేసీఆర్ పగా చల్లారి పోయింది అని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తన ఆగ్రహం ఇంకా చల్లారలేదు అని నిరూపిస్తున్నారు.


 ఏపీలో కేసీఆర్ మిత్రుడు జగన్ సీఎం గా ఉన్నారు. చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండడంతో జగన్ ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తూ చేస్తూ ధైర్యంగా బాబు ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ కు కేసీఆర్ సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ ఆస్తులపై ఐటీ దాడులు జరగడం, కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో చంద్రబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ సైతం ఇరుక్కున్నారు. ఇక కొత్తగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఎస్ ఐ స్కాం లో ఇరుక్కున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ బయటపెట్టడంతో టిడిపి ఇబ్బందికర పరిస్థితులు వచ్చిపడ్డాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ద్వారా టిడిపి ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి వ్యవహారాలు మొత్తం వెలికితీయాలని జగన్ భావిస్తున్నారు. 


ఈ సిట్ ను ఇంత వేగంగా ఏర్పాటు చేయడం వెనుక కేసీఆర్ వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సలహా మేరకే జగన్ ఆఘమేఘాల మీద సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సిట్ దర్యాప్తులో చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు అడ్డంగా దొరికే అవకాశం ఉండడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విధంగా కేసీఆర్ జగన్ ద్వారా చంద్ర బాబు మీద ఉన్న కోపాన్ని తీర్చుకోబోతున్నట్టు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: