అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్ లో కాలుమోపారు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ కు అత్యంత ఘనమైన స్వాగతం లభించింది. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 'నమస్తే ట్రంప్‌' వేదికకు వారు చేరుకోనున్నారు. మెతెరా స్టేడియం అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

 

 ట్రంప్‌కి ప్రజలంతా ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు ట్రంప్ దంపతులను పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. ఇక సబర్మతీ ఆశ్రమం గురించి ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ కి వివరించారు. ఆశ్రమాన్నంతటినీ చూపుతూ వారితో గడిపారు. ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మొతేరా స్టేడియం ఇప్పటికే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలతో నిండిపోయింది. పలువురు పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ స్టార్లు షారూక్ ఖాన్, అక్షయ్, మాధురీ దీక్షిత్, కంగనా రనౌత్ తదితరులు కూడా స్టేడియంలో ఉన్నారు.

 

ఇక వాస్తవానికి ట్రంప్ కొన్నిరోజులుగా తనకు భారత్ లో నమ్మశక్యం కాని రీతిలో స్వాగతం లభిస్తుందని అంచనాలు వేయడమే కాదు, దీనిపై ప్రకటనలు కూడా చేశారు. ఇప్పుడాయన అంచనాలకు మించడంతో సహాయక బృందం కూడా సంతోషం పట్టలేకపోతోంది.  భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగత వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ పర్యటనకు వచ్చిన ట్రంప్ కి ఒక్కొక్కరూ తమ స్థాయికి తగ్గ బహుమతులు అందిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోసం తమిళనాడుకు చెందిన ఇనియావాన్‌ అనే చెఫ్‌ భారీ ఇడ్లీలను తయారు చేసారు. ఇడ్లీపై ట్రంప్, ప్రధాని మోడీ, రెండు దేశాల జాతీయ జెండాలను గీసారు. ఈ మూడు ఇడ్లీల బరువు 107 కేజీలు ఉంటుందని తెలిపారు. ఈ ఇడ్లీలను ఆరుగురు వర్కర్ల సాయంతో 36 గంటల పాటు కష్టపడి చేసినట్టు ఆయన తెలిపారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: