ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఎంతో ఆసక్తిని సంతరించుకుంది. ఇక మొదటి సారి డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న డంతో అహ్మదాబాద్ నగరం మొత్తం సర్వాంగ సుందరంగా అలంకరించ పడింది. ఇక ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్ విమానాశ్రయం నుండి మొతేరా  స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మోతేర  స్టేడియంలో నమస్తే ట్రంప్  కార్యక్రమంలో  డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నమస్తే అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అంతేకాకుండా భారతదేశం అమెరికా సత్సంబంధాలను ఎప్పుడూ ఇలాగే కొనసాగించాలి అంటూ డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. 

 

 

 అయితే డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్  ముద్దుల కుమార్తె ఇవాంకా ట్రంప్ ఓ ఆసక్తికర పోస్టు సోషల్ మీడియా వేదికగా పెట్టారు. అయితే ట్రంపు కంటే ముందు ఇవాంకా ట్రంప్ రెండేళ్ల క్రితమే భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో జరిగిన గ్లోబల్ ఇంటర్ ప్రినియర్  సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య మధ్య  స్నేహాన్ని వేడుక చేసుకోవడానికి ఇండియాకు తిరిగి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా అంటూ ఇవాంకా ట్రంప్ పోస్ట్ పెట్టారు. ఇక ప్రస్తుతం ఇవాంక ట్రంప్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 

 

 ఇకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విమానంలో కుటుంబంతో సహా వచ్చిన డోనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ ను  ఆలింగనం చేసుకుని ఘనస్వాగతం పలికారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు మరియు భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు అందరూ ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్ తో  పాటు అధ్యక్షుడు సీనియర్ సలహాదారు ఆయన కూతురు ఇవాంక ట్రంప్  అమెరికాకు చెందిన పలువురు మంత్రులు ఉన్నతాధికారుల బృందం కూడా భారత్కు విచ్చేసారూ. ఇక ప్రస్తుతం అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: